ప్రత్యేక హోదా అన్నది ఇపుడు ఏపీ ప్రజల సెంటిమెంట్ గా మారింది. రాజకీయ నాయకులు, పార్టీలూ ఎన్నెన్ని యూ టర్న్ లైనా తీసుకుంటాయి కానీ, జనం ఎపుడూ హోదా కోసమే నిలబడ్డారు. ఎందుచేతంటే అది వారికి జీవన్మరణ సమస్య. బంగారం లాంటి హైదరాబాద్ ఎటూ పోయింది. హోదా అయిన వస్తే రాయితీలతో పరిశ్రమలైనా వస్తాయి. ఉన్నంతలో బతుకులు బాగు పడతాయని జనం నమ్ముతున్నారు. కానీ ఆ సోయి మన ఏలికలలో లేకుండా ఉంది. అందుకే ఓ మునికోటి, నిన్న బంద్ లో ఓ వైసీపీ కార్యకర్త. ఇపుడు చిత్తూరులో చేనేత కార్మికుడు సుధాకర్ బలిదానం. ఈ మధ్యలో కూడా ఎన్నో జరిగాయి. అయినా హోదా ఎవరికీ పట్టనిదే అవుతోంది.


నాడే ప్యాకేజ్ వద్దనుంటే :


మూడేళ్ళ క్రితం బీజేపీ ప్రభుత్వం హోదాని పక్కన పెట్టిన నాడే బాబు సర్కార్ గట్టిగా నిలదీయాల్సింది. ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజ్ అంటూ చెవిలో క్యాబేజీ పూవులు పెట్టిన నాడైనా వ్యతిరేకించాల్సింది. అన్నింటికీ తలూపడమే కాకుండా. నాలుగేళ్ళు అంటకాగి హోదాను తాకట్టు పెట్టిన టీడీపీ సర్కార్ ఇపుడు ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని బొల్లి ఏడుపులు ఎంత ఏడిస్తే ఏం లాభం. అందుకే ఆశలన్నీ అవిరైనాకే యువత బలిదానాలకు పాల్పడుతున్నారు.


రాజకీయమే చేస్తున్నారు :


ఇప్పటికీ హోదాపై టీడీపీ ప్రభుత్వం చిత్త శుధ్ధితో పోరాడుతోందన్న భావన, నమ్మకం ప్రజలలో ఎక్కడా లేదు. ఎన్నికల కోసమే ఇదంతా అని అనుకునే వారే ఎక్కువగా ఉన్నారు. దానికి బలం చేకూర్చేలా మొన్నటికి మొన్న ప్రధాన  ప్రతిపక్షం వైసీపె ఇచ్చిన బంద్ పిలుపుని కోరి మరీ బాబు సర్కార్ పోలీసులను పెట్టించి అరెస్టులతో నిలువరించడాన్ని కూడా జనం గమనిస్తున్నారు. హోదా పేరిట  ధర్మ పోరటాం పేరు చెప్పి పాతిక ఎంపీ సీట్లు ఇవ్వండంటూ స్వయంగా చంద్రబాబు, చినబాబు కోరుతూండడం చూసిన జనానికి వీళ్ళది రాజకీయ యావ అని తెలిసిపోయింది. అందుకే హోదా రాదనుకున్న వారంతా అత్మ హత్యలకు పాల్పడుతున్నారు.


పోరాడి సాధించాలి :


ప్రత్యేక హోదా ఏపీకి రాకపోవడానికి రాజకీయ నాయకత్వ వైఫల్యం ప్రధాన కారణం. దీనిని అర్ధం చేసుకుని ప్రజలు వత్తిడి పెంచాలి. అంతే తప్ప ఇలా తనువు చాలించడం బాధను పెంచేదే తప్ప మరోకటి కానే కాదు. ఇక  ఇది బాబు సర్కార్ చేయించిన ఆత్మ హత్య అని వైసీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. అది పక్కన పెట్టినా కనీసం బాధితుడి కుటుంబానికి సానుభూతి అయినా టీడీపీ నాయకులు తెలియచేయలేకపోతున్నారంటే అంత కంటే బాధ మరొకటి ఉండదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: