నాలుగు నెలల క్రితం వరకూ కాంగ్రెస్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా ఉతికి ఆరేసిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఇంతలో ఎంతలా మారిపోయారో. కాంగ్రెస్ నయమని నిన్న చెప్పారు. ఇవాళ మరో అడుగు ముందుకేసి తప్పు తెలుసుకుంది,  ఆ పార్టీ చాల మంచిదే అంటూ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెడితే మద్దతుగా నిలిచింది. ఏపీ పట్ల కాంగ్రెస్ కి సానుభూతి ఉందంటున్నారు ముఖ్యమంత్రి గారు. నమ్మేద్దామా... ఒంగోలు లో ఈ రోజు  జరిగిన ధర్మ పోరాట దీక్ష సభలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 


పాతాళానికి పాతిపెట్టాలన్నారు :


నిన్న మొన్నటి వరకూ ఇదే కాంగ్రెస్ పార్టీని పాతాళం  వరకూ పాతిపెట్టాలని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబే.  కాంగ్రెస్  చేసిన ఘోరానికి అసలు క్షమించకూడదన్నదీ టీడీపీనే. ఆ పార్టీకి ఇంక ఏపీలో పుట్ట గతులు ఉందరాదని శపధం పట్టిందీ పసుపు పార్టీయే. తెలుగు వారంటే కాంగ్రెస్ కి ఎంతటి కోపమో అని విరుచుకుపడిందీ బాబే. మరి ఇదేంటి ఇలా ...


నాలుగేళ్ళలో ఎలా నచ్చేసింది :


కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ జన్మ ఎత్తిన బాబు ఎన్ని వంకర్లైనా తిరుగుతారు, తన ఎత్తులు, పొత్తుల కోసం ఏమైనా అంటారు. ఇవాళ  కాంగ్రెస్ భజన చేస్తూ  అనుకూల మీడియా కధనాలు వండి వార్చవచ్చు గాక. అసలు  అశాస్త్రీయ  విభజన అంటున్న టీడీపీ ఆ విభజనకు కారణం అయినా పార్టీ ఇపుడు మారిందని ఎలా సర్టిఫికేట్ ఇస్తారంటూ సెటైర్లు పడుతున్నాయి. నిన్నటి వరకు జగన్ ని విమర్శిచాలంటే తల్లి కాంగ్రెస్ , పిల్ల కాంగ్రెస్ అనే టీడీపీ నాయకులు ఇపుడు పిల్ల టీడీపీ అని ఒప్పేసుకుంటున్నారా అంటూ  సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.



 రాజకీయం కోసం ఏమైనా  చేయవచ్చునన్ని టీడీపీ  ఇలా మరీ పచ్చిగా బయటపడిపోతూంటే  జనం ఏడవలేక నవ్వుతున్నారు. టీడీపీలోనే సీనియర్ మోస్ట్ నాయకుడు కేయీ క్రిష్ణమూర్తి కాంగ్రెస్ తో కలిస్తే నేను పార్టీలో ఉండనన్నారు.  అలాంటి వాళ్ళు ఎంతో మంది పార్టీలో ఆ
ఉన్నారు. ముందు వారిని ఒప్పిస్తే ఆనక జనాన్ని ఒప్పించేందుకు టీడీపీ ట్రై చేస్తే బాగుంటుందని నెటిజన్లే అటాక్ చేస్తున్నారు./


మరింత సమాచారం తెలుసుకోండి: