సాధారణంగా అయిదేళ్ళు పాలించిన పార్టీ తాము చేసిన మంచి పనులను జనాలకు చెప్పి ఓట్లు అడుగుతుంది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రభుత్వం చేసిన తప్పులు వివరించి చెప్పడం ద్వారా ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటాయి. ప్రభుత్వం బాగా పాలిస్తే వ్యతిరేక ప్రచారం ఎంత చేసినా జనాలు మళ్ళీ అధికార పక్షాన్నే గెలిపిస్తారు.  ఇదీ రాజకీయలలో జరిగే తంతు. మరి  ఏపీలో చూసుకుంటేచిత్రమైన రాజకీయం నడుస్తోంది.  అధికారం అనుభవిస్తున్న టీడీపీయే వ్యతిరేక ఓటు పైన ఆధారపడడం రాజకీయ దౌర్బల్యమేనా. అంటే అవుననే జవాబు వస్తోంది.


చెప్పుకునేందుకు ఏమీ లేదా :


ఏపీలో రాజకీయ గండర గండడు, సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి. ఈ టెర్మ్ పూర్తి అయితే ఆయన దాదాపుగా పద్నాగుగేళ్ళు సీఎం గా పాలించిన రికార్డ్ సాధిస్తారు. అంతటి చంద్రబాబుకు తన పాలన గురించి దమ్ముగా, ధైర్యంగా   జనాలకు చెప్పుకుని పాజిటివ్ ఓట్లు తెచ్చుకునే సామర్ధ్యం   లేదా అన్నదే ఇక్కడి ప్రశ్న. నాలుగేళ్ళ పాటు కేంద్రంలోని బీజేపీతో కలసి పాలన చేసిన బాబు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయనగానే ఆ పార్టీకు తూచ్ అనేశారు. అంతే ఆ మరునాటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పేశారు. అదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ, కొత్తగా వచ్చిన పవన్ పైనా విమర్శలు చేస్తూ ఓట్ల వేట స్టార్ట్ చేశారు. తన ఏలుబడి గురించి, ఇంతకాలం సీఎం గా తాను చేసిన నాలుగు మంచి పనుల గురించి  చెప్పుకునే ధైర్యం సీఎం ఎందుకు చేయలేకపోతున్నారన్నది ఇక్కడి ప్రశ్న.


నిజంగా అభివ్రుధ్ధి జరిగితే చెప్పుకోవచ్చు, మరి జరిగిందా లేదా అన్నడి సీఎం కే స్పష్టత ఉందా అన్నదే ఇక్కడ డౌట్.  నాలుగేళ్ళ క్రితం నాటి ఎన్నికల ప్రసంగాలే ఇపుడు మళ్ళీ బాబు చేస్తున్నారు.  అయితే అపుడు ఆయన పదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆ గొంతు అలా సరిపోయింది. ఇపుడు సీఎంగా వుంటూ వ్యతిరేక ఓటు కోసం వెంపర్లాడం వల్ల ఉపయోగం ఉంటుందా. లేక ప్రతిపక్షాల ఓట్లు తనకే పడాలన్న అత్యా  అన్నది బాబుకే తెలియాలి.  మొత్తానికి నాడు కాంగ్రెస్ ని తిడుతున్న బాబు ఇపుడు బీజేపీని ఉతికేస్తున్నారు. అపుడు కాంగ్రెస్ తో జగన్ కు కుమ్మక్కు అంటగట్టిన బాబు ఇపుడు బీజేపీతో అదే కుమ్మక్కు అంటకడుతున్నారు. మరి జనాలు అధికారంలో ఉన్న పార్టీ చేసిన అభివ్రుధ్ధి చూసి ఓట్లు వేస్తారా. ఎవరినో నిందించి పబ్బం గడుపుకుందామనుకునే టీడీపీకి పట్టం కడతారా... చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: