వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి రెండు సార్లు ముఖ్య మంత్రి అయినా, తన తండ్రి చనిపోయిన తరువాత అతనికి  రాజకీయ పరిస్థితులు సులభంగా లేవు. అడుగడుగునా ముళ్ల దారులే. అయినా ఎప్పుడు కూడా భయపడలేదు. తనను అత్యంత రాజకీయ శక్తులు అయినా కాంగ్రెస్ జైల్లో పెట్టిస్తుందని తెలిసిన వెనుకడుగు వేయలేదు. అయితే ఇప్పడూ జగన్ చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రజలు చర్చించు కుంటున్నారు. కాపుల రిజర్వేషన్ ల విషయం లో జగన్ మాట్లాడిన మాటలు రాజకీయ నాయకుడికి అతనికి తేడా ఏంటో నిరూపించాయి. 

Image result for jagan

కొన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిథిలో ఉండవు. అటువంటిదే ఈ రిజర్వేషన్ అంశం. రిజర్వేషన్లు 50శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేపథ్యంలో, ఇది రాష్ట్ర పరిథిలోని అంశంకాదు. ఇది నేను చేయలేని అంశం కాబట్టి, నేను చేయలేకపోతున్నానని ఏమాత్రం మొహమాటం లేకుండా చెబుతున్నాను.ఓ బహిరంగ సభలో ఎవరైనా ఇలా మాట్లాడతారా? జగన్ మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్రం పరిథిలో లేదని, తన వల్లకాదని జగ్గంపేట బహిరంగ సభలో జగన్ స్పష్టంగా చెప్పారు. కానీ ఇదే అంశంపై టీడీపీ నాయకుల మాటలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

Image result for jagan

తమవల్ల కాదని, తమ చేతిలో లేదని తెలిసి కూడా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ టీడీపీ నేతలు వట్టి మాటలు చెబుతున్నారు. జగన్ మాత్రం కాపులకు పూర్తి భరోసా ఇచ్చారు. గతంలో రుణమాఫీ విషయంలో కూడా జగన్ ఇంతే స్పష్టంగా వ్యవహరించారు. రుణమాఫీ సాధ్యంకాదని పబ్లిక్ మీటింగ్స్ లో ప్రకటించారు. అదే గత ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూలంగా మారిందనే విషయం జగన్ కు కూడా తెలుసు. అదే అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, ఆ తర్వాత రుణమాఫీ చేయలేకపోయింది. ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ డబ్బులు వడ్డీలు కట్టడానికే సరిపోయాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: