ప్రత్యేక హోదాపై పోరాటం పేటెంట్ నాదేనంటూ జనాలను మభ్యపెడుతున్న చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసి మరీ కేవీపీ అసలు గుట్టు బయట పెట్టారు. నాలుగేళ్ళు మోడీ మోజులో మునిగితేలినపుడు హోదా అంశం గుర్తు రాలేదా బాబు అంటూ సెటైర్లు వేశారు. హోదా అంటే జైలుకే అన్న మాటలు అంతలోనే మరచిపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. హోదా కోరుతూ తాను రెండేళ్ల క్రితమే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడితే దానికి కనీసం మద్దతు ఇవ్వకుండా అధికార పక్షం వైపు మీ ఎంపీలు కూర్చుని అవహేళన చేసిన సంగతిని అపుడే మరచిపోయారా అంటూ నిందించారు.

 

రాహుల్ మీద కోడిగుడ్లు వేశారు :


రెండేళ్ళ క్రితం రాహుల్ గాంధీ గుంటూరు వచ్చి ప్రత్యేక హోదాపై మీటింగ్ పెడితే ఆయన కాన్వాయ్ పై కోడిగుడ్లు వేయించింది టీడీపీయే కదా, ఆ అదేశాలు కూడా ముఖ్యమంత్రి ఆఫీసు నుంచే వెళ్ళాయి కదా అని కేవీపీ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. హోదా కంటే ప్యాకేజ్ బాగుందంటూ ఒకటికి పదిసార్లు చెప్పిన మాటలు జనం చెవులలో ఇకా మోగుతూనే ఉన్నాయని అన్నారు.

 

అసలు ఎత్తిందే మేము :

 

ప్రత్యేక హోదా అంశం అసలు మొదట ఎత్తుకున్నదే కాంగ్రెస్ పార్టీ అని కేవీపీ చెప్పారు. 2014 జూన్ 2న  హోదా ఏపీకి ఇవ్వాలని కోరుతూ సోనియాగాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారని కేవీపీ గుర్తు చేశారు. ఆ తరువాత పదే  పదే హోదాపై పోరు చెపట్టింది కూడా తమ పార్టీయే అన్నారు. హోదాపై మాటలు మార్చి ఊసరవెల్లి కన్నా ఘోరంగా బాబు మారారని కేవీపీ హాట్ కామెంట్స్ చేశారు. అసలు కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి కాంగ్రెస్ సంఖ్యా బలం కదా కారణం.


మా పార్టీ కంటే ముందు నోటీస్ ఇచ్చినందుకే స్పీకర్ మీ తీర్మానం చెపట్టారని, కేవలం ఆ టెక్నికల్ అంశాన్ని మరుగున పరచి మేమే మోడీపై తీర్మానం పెట్టామంటూ గొప్పలు పోతూ జనాన్ని తప్పుతోవ పట్టిస్తున్నారంటూ బాబుకు చురకలు అంటించారు. ఈ మేరకు కేవీపీ ఈ రోజు కేవీపీ బాబుకి రాసిన లేఖ టీడీపీ పరువు మొత్తం తీసేసింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: