కాపు రిజర్వేషన్ ల మీద జగన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా కాక రేపుతూనే ఉన్నాయి. నేను హామీ ఇవ్వలేనని ముక్కు సూటిగా చెప్పడం తో కాపులలో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అయితే జగన్ మరీ అంతగా కుండ బద్దలు కొట్టి చెప్పడం రాజకీయాల్లో ముఖ్యముగా ఇటువంటి సున్నిత మైన విషయాల్లో పనికి రాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీనితో పార్టీ కి డామేజ్ జరుగుతూందోనేమని పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు. 

Image result for jagan

చంద్రబాబు మాట జారితే సర్దుబాటు చేద్దామని, వీలయితే దాచేద్దామనీ చూస్తుంది అదే మీడియా. కావాలంటే ఆ మధ్య కర్నూలు వెళ్లి చినబాబు లోకేష్ మాట్లాడిన మాటలు అక్కడ సంచలనం రేకెత్తించాయి. కానీ దాన్ని ఎంత స్మూత్ గా బయటకు రాకుండా చేసింది మన మీడియా? కానీ జగన్ విషయంలో అలాంటి చాన్స్ లేదు కదా? మరి అలాంటపుడు మరింత జాగ్రత్తగా వుండాలి కదా? ఆ విషయం జగన్ ఎప్పటికి తెలుసుకుంటాడు?

Image result for jagan

నిజానికి జగన్ మట్లాడాలంటే కాపుల రిజర్వేషన్ మీద సవాలక్ష విధాలుగా మాట్లాడవచ్చు.  ఎప్పటికి తగు మాటలాడువాడు ధన్యుడు అన్నాడు సుమతీకారుడు. ఆ విషయం జగన్ కు అస్సలు తెలియదు. తెలిసి వుంటే పవన్ మీద కావచ్చు, కాపుల రిజర్వేషన్ మీద కావచ్చు. ఇలా అయితే మాట్లాడి వుండడు. కాపుల  రిజర్వేషన్ సాధ్యం కానిది, అందుకే నేను మాట ఇవ్వలేను అంటూ. కుండ బద్దలు కొట్టి వుండడు.


మరింత సమాచారం తెలుసుకోండి: