టీడీపీ కి ప్రస్తుతం దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ 2009 లో పార్టీ తరుపున ప్రచారం చేసి ఒక చిన్నపాటి సునామినే సృష్టించాడు. తరువాత బాబుకు, ఎన్టీఆర్ కు గ్యాప్ పెరిగింది బాబు ఎన్టీఆర్ ను పట్టించుకోవడం మానేసిన సంగతీ తెలిసిందే. అయితే ఎప్పుడూ కూడా టీడిపి ఎంపీ లు ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ గురించి పాజిటివ్ గా మాట్లాడరు. కానీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎన్టీఆర్ నటన గురించి క్రమశిక్షణ గురించి పొగిడినాడు.  

Image result for jr ntr

ఆయన మరెవరో కాదు దివంగత టిడిపి సీనియర్ నాయకులూ ఎర్రన్నాయుడు గారి కుమారుడు. తనకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాల ఇష్టమని అంటున్నారు. తన అభిరుచుల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ తనకు బాస్కెట్ బాల్ మరియు క్రికెట్ అంటే చాల ఇష్టమై, అవి ఆడమంటే ఎప్పుడైనా ఆడడానికి తాను సిద్ధమని అన్నారు.

Image result for tdp mp rammohan naidu

సినిమాలు కూడా బాగా చూస్తానని, మన తెలుగు నటులలో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఒక నటుడిగా మొదటి నుండి అయన ఎదిగిన క్రమం, అలానే క్రమశిక్షణ, నటనలో పలికే హావభావాల వల్లనే ఆయన అంత అద్భుత పేరు గడించారని రామ్ మోహన్ నాయుడు చెపుతున్నారు. ఇక హిందీ హీరోల్లో అమీర్ ఖాన్ అంటే తనకు ఇష్టమని, అలాగే ట్రావెలింగ్ ఇష్టమని, తనకు ఇష్టమైన ప్రదేశాల్లో న్యూ యార్క్ సిటీ మరియు భరత్ లోని హిమాలయాలు తన ఫేవరెట్ అని చెప్పారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: