ఏపీలో మరో మారు కాపుల రిజర్వేషన్ అంశం పొలిటికల్ గా హీట్ రేపుతోంది. వైసీపీ అధినేత జగన్ కావాలని అన్నారో, వ్యూహాత్మకంగా చెప్పారో తెలియదు కానీ కాపు రిజర్వేషన్ తేనె తుట్టెను కదిల్చారు. సరే, జగన్ స్టాండ్ ఏంటో చెప్పేశారు. ఇక కాపులు  వైసీపీకి ఓటు వేస్తారో లేదో ఆలొచించుకోవాలి. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికలలో కాపులకు ఇచ్చిన హామీకే అతీ గతీ లేదు. దాంతో ఆ పార్టీ ఈ ఇష్యూలో చెప్పాల్సిందేమీ లేదు.

డీల్ చేసేదెలా :


ఇక చూడబోతే. జనసేనాని పవన్ కాపులకు ఆపద్బాంధవుడులా ఉన్నారట.  పైగా సొంత సామాజికవర్గం కావడంతో ఆశలు రెట్టింపు అవుతున్నాయి. దానికి తోడు పవన్ ప్రస్తుతం గోదావరి జిల్లాలలో టూర్ చేస్తున్నారు. దాంతో పవన్ ఈ ఇష్యూపై ఎలాగైనా పెదవి విప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి కులాలకు వ్యతిరేక మంటున్న పవన్ తన ఓటు బ్యాంక్ గా ఉండబోతున్న కాపులను అంత తేలిగ్గా తీసుకోలేరు. అలాగని పట్టించుకుంటే అది పెద్ద తలకాయ నొప్పే అవుతుంది. సో. పవన్ ఏంచేస్తారన్నదే ఇపుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. 


బాబు పైనే బాణాలు :


కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మాట ఇచ్చిన చంద్రబాబే దానిని నిలబెట్టుకోవాలంటూ పవన్ ఎదురు దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అది పూర్తిగా తప్పించుకునే వైఖరి లాగానే ఉంటుంది తప్ప పవన్ పార్టీ స్టాండ్ కాబోదు, తాను అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్తే బీసీలు దూరమవుతారు. చెప్పకపోతే కాపులు గుస్సా అవుతారు. ఇది పవన్ కు అగ్ని పరీక్షేనని అంటున్నారు. మొత్తానికి జగన్ గురి పెట్టింది పవన్ కేనని కూడా అంటున్నారు. చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: