తెలుగుదేశంపార్టీ ఎప్పుడూ ఒకే ప‌ద్ద‌తిలో ఉంటుంది. ప్ర‌త్య‌ర్ధుల‌పై బుర‌ద‌చ‌ల్లాల‌ని అనుకున్న‌పుడు ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం నడచుకుంటారు నేత‌లు.  పై స్ధాయి నుండి క్రింద స్ధాయి వ‌ర‌కూ ప్ర‌త్య‌ర్ధుల‌పై ఒకే విధంగా ఒక‌టికి ప‌దిసార్లు విరుచుకుప‌డుతుంటారు. తాజాగా వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి .పై టిడిపి నేత‌ల చేస్తున్న దాడి ఇదే విధంగా ఉంటోంది. కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు స‌బంధించి జగ్గంపేట‌లో బ‌హిరంగ‌స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ రిజ‌ర్వేష‌న్ అంశం త‌న చేతిలో లేద‌ని, కేంద్ర‌ప‌రిధిలోని అంశ‌మ‌న్నారు. 


అబ‌ద్దాలు చెప్పిందే చంద్ర‌బాబు

Image result for chandrababu naidu

నిజానికి జ‌గ‌న్ చెప్పిందాంట్లో త‌ప్పేమీ లేదు.  పోయిన ఎన్నిక‌ల్లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని  చంద్ర‌బాబు చెప్పిన విష‌యం గుర్తుండే ఉంటుంది. అధికారం అందుకోవ‌ట‌మే ల‌క్ష్యంగా అప్ప‌ట్లో చంద్ర‌బాబు చెప్పింది పూర్తిగా అబ్బ‌ద్ధం.  ఇక‌, ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే జ‌గ‌న్ చెప్పిందానికి మంత్రులు, టిడిపి నేత‌లు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నారు. 


రిజ‌ర్వేష‌న్ల‌పై వైసిపి వైఖ‌రి బ‌య‌ట‌ప‌డింద‌ట‌

Image result for minister narayana

మంత్రి నారాయ‌ణ మాట్లాడుతూ,  కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై వైసిపి వైఖ‌రి బ‌ట్ట‌బ‌య‌లైంద‌న్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి షెడ్యూల్ 9 లో చేరిస్తే కాపు రిజ‌ర్వేష‌న్ సాధించ‌వ‌చ్చ‌ని చెప్పిన‌ట్లు మంత్రి గుర్తు చేశారు. ఇపుడు జ‌గ‌న్ మాట మారుస్తున్న‌ట్లు నారాయ‌ణ ఎద్దేవా చేశారు. పైగా జ‌గ‌న్ మాట మార్చ‌టం వెనుక కేంద్ర‌ప్ర‌భుత్వం పాత్ర ఉంద‌ని కూడా చెప్పారు. 


కాపుల‌కు జ‌గ‌న్ అన్యాయం చేస్తున్నార‌ట‌

Image result for minister kala venkata rao

మంత్రి క‌ళా వెంక‌ట్రావు మాట్లాడుతూ, కాపులు అన్యాయం చేసే నైజం జ‌గ‌న్ లో క‌న‌బ‌డుతోంద‌న్నారు. కాపులపై జ‌గ‌న్ ధ్వేషం క‌క్కుతున్నార‌ట‌.  మోడి ద‌ర్శ‌క‌త్వంలోనే జ‌గ‌న్ కాపుల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న‌ట్లు క‌ళా ధ్వ‌జ‌మెత్తుతున్నారు. బిజెపి చెప్పిన‌ట్లు న‌డుచుకుంటున్న జ‌గ‌న్, ప‌వ‌నే  కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై మోడిని ఒప్పించాల‌ని ఫిట్టింగ్ ఒక‌టి  పెడుతున్నారు. ఎంఎల్సీలు అన్న సంతీష్, బుద్దా వెంక‌న్న‌లు కూడా జ‌గ‌న్ పై మండిప‌డుతున్నారు. కాపుల‌పై జ‌గ‌న్ వ్య‌తిరేక‌త బ‌య‌ట‌ప‌డిందంటూ వారు ధ్వ‌జ‌మెత్తటం ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నారు. 


మీడియా చ‌ల్లుతున్న బుర‌ద‌


పై మొత్తం మీద చూస్తే   జ‌గ‌న్ చెప్పింది ఒక‌టైతే ,  మంత్రులు, ఎంఎల్సీలు చెబుతున్న‌ది మ‌రొక‌ట‌న్న విష‌యం అర్ధ‌మైపోతుంది. ఎందుకంటే, కాపుల రిజ‌ర్వేష‌న్ల‌కు తాను వ్య‌తిరేక‌మ‌ని జ‌గ‌న్ చెప్ప‌లేదు. కానీ  టిడిపి మాత్రం కాపుల‌కు జ‌గ‌న్ వ్య‌తిరేక‌మ‌న్న‌ట్లుగా ముద్ర వేసేస్తోంది. జ‌గ‌న్ ఏం చెప్పినా స‌రే టిడిపి మాత్రం తాము చెప్ప‌ద‌లుచుకున్న‌ది, చేయ‌ద‌ల‌చుకున్న‌దే  చేస్తుంది. ఎందుకంటే, మీడియాలో  మెజారిటీ మీడియా జ‌గ‌న్ పై బుర‌ద‌చ‌ల్ల‌ట‌మే ధ్యేయంగా ప‌నిచేస్తోంది కాబ‌ట్టి. 


మరింత సమాచారం తెలుసుకోండి: