జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాపు రిజర్వేషన్స్ గురించి నేను హామీ ఇవ్వలేనని చెప్పాడో టీడీపీ పాత పల్లవే  అందుకున్నది. జగన్ మోసగాడు. అతను మనిషే కాదు అంటున్నారు. అస్సలు జగన్ ఏమన్నాడు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశం కాదు అని చెప్పినాడు. దాన్ని పట్టుకొని టీడిపి నానా యాగీ చేస్తుంది. అదేదో టీడీపీ మాత్రం కాపులకు న్యాయం చేసినట్లు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. 2014 లో కాపులను మోసం చేసింది టీడీపీ నే అని అందరికీ తెలిసిందే. 

Related image

ఒకవేళ జగన్ కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా ప్రకటన చేసి ఉన్నా... తెలుగుదేశం పార్టీ జగన్‌ది మోసమనే అనేది. ముద్రగడ పద్మనాభం వచ్చి వైసీపీలోకి చేరిపోయే వారు కాదు, ఇప్పుడు ఫేస్ బుక్‌లో జగన్ ను విమర్శిస్తున్న వాళ్లు సోషల్ మీడియాలో యథాతథమైన పోస్టులే పెట్టే వాళ్లు. ఏదో ఒకదాన్ని పట్టుకుని విమర్శిస్తూ! జగన్ ఏం మాట్లాడినా.. అందులో నెగిటివిటీని తీసి, జగన్ కు వ్యతిరేక ప్రచారం చేయడమే చాలా మందికి పని. జగన్ ఊ అన్నా.. తప్పే, ఆ.. అన్నా తప్పే, రిజర్వేషన్లకు అనుకూలం అని ప్రకటించి ఉన్నా జగన్ మీద ఈ రచ్చ జరుగుతూనే ఉండేది. జగన్ ను కార్నర్ చేయడమే పనిగా మెజారిటీ మీడియా వర్గాలు పని చేస్తున్నాయి. కాబట్టి ఏం మాట్లాడినా రొటీన్ రియాక్షనే ఉండేది.

Image result for jagan padayatra

కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ మాట్లాడిన తీరుతో కాపులంతా దూరం అయిపోయారని అని తెలుగుదేశమో, మరొకరో తీర్మానిస్తే అది కేవలం వారి అమాయకత్వం తప్ప ఇంకేం లేదు. మరి అలా అయితే.. ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెడతానని ఇటీవలే జగన్ ప్రకటించాడు. దాంతో విజయవాడ పరిసర కమ్మ వాళ్లంతా వైసీపీకి ఓటేస్తారా? రాజకీయాల్లో కుల సమీకరణాలు నిజమే, అయితే కులమే నిర్దేశిస్తుంది అనేది చంద్రబాబు హయాం దగ్గర నుంచి కొంతమంది మేథావులు కూడా ఆ భ్రమలోకి వెళ్లిపోయారు. అది భ్రమ మాత్రమే, క్షేత్ర స్థాయి వేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: