ఏ విష‌యంలో అయినా స‌రే యుట‌ర్న్ తీసుకోవ‌టంలో తెలుగుదేశంపార్టీకి మించిన పార్టీ దేశంలో మ‌రోటి లేదమో ?  తాజాగా ఆర్దిక‌శాఖ మంత్రి, సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.  కాపుల‌కు రిజ‌ర్వేషన్ క‌ల్పించ‌టం త‌మ చేతిలో ప‌నికాద‌న్నారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేస్తే కానీ కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌టం సాధ్యం కాదంటూ చేతెలెత్తేశారు.  అంటే కాపుల రిజ‌ర్వేషన్ అంశంపై టిడిపి తాజాగా యుట‌ర్న్ తీసుకున్న‌ట్లే క‌దా ? 


జ‌గ‌న్ చెప్పిందే య‌న‌మ‌ల చెప్పారు 

Image result for yanamala ramakrishnudu

ఈరోజు య‌న‌మ‌ల చెప్పిందే మూడు రోజుల క్రితం వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అంశం రాష్ట్ర‌ప‌రిధిలోని కాద‌న్నారు. రిజ‌ర్వేష‌న్ల‌పై నిర్ణ‌యం తీసుకోవాల్సింది కేంద్ర‌ప్ర‌భుత్వ‌మ‌నే క‌దా జ‌గ‌న్ చెప్పింది కూడా ? మ‌రి మూడు రోజుల పాటు జగ‌న్ ను కాపుల వ్య‌తిరేకిగా ముద్ర‌వేసిన చంద్ర‌బాబు అండ్ కో ఇపుడు జ‌గ‌న్ చెప్పిన విష‌యాన్నే హ‌టాత్తుగా తాము చెప్ప‌ట‌మేంటి ?


హోదాపైనా యుట‌ర్నే

Image result for special status for ap

మొన్నటికిమొన్న ప్ర‌త్యేక‌హోదా, ప్ర‌త్యేక ప్యాకేజిపై చంద్ర‌బాబునాయుడు ఎన్ని మార్లు పిల్లిమొగ్గ‌లు వేసింది అంద‌రూ చూసిందే .చివ‌ర‌కు నాలుగేళ్ళు బిజెపితో అంట‌కాగి హ‌టాత్తుగా ఎన్డీఏలో నుండి  బ‌య‌ట‌కు వ‌చ్చేసిన త‌ర్వాత ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో యుట‌ర్న్ తీసుకుని మొద‌టి నుండి పోరాటం చేస్తున్న‌ది తానే అన్నంత‌గా బిల్డ‌ప్ ఇస్తున్నారు. 


ఇంకా ఎన్ని యుట‌ర్నులున్నాయో ? 


కేంద్ర‌ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌టం,  అంత‌కుముందు రాజ్య‌స‌భ‌లో  ప్రైవేటు మెంబ‌ర్ బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌టం లాంటి అనేక అంశాల‌పై ఎన్నోసార్లు యుట‌ర్న్ లు తీసుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా చంద్ర‌బాబు ఇంకా ఎన్ని యుట‌ర్న్ లు తీసుకుంటారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: