ప్రస్తుత రాజకీయాలలో నిజాయతీగా ఉన్నది  ఉన్నట్లు చెబుతూ వస్తున్న నేతగా జగన్ కు జనంలో పేరుంది. దానికి తగినట్లుగానే ఆయన కాపుల విషయంలో ఉన్నదాన్నే  చెప్పారు. రిజర్వేషన్లు కేంద్ర పరిధిలోని అంశమని స్పష్టంగా కుండ బద్దలు కొట్టారు. అయితే జగన్ అన్న దానిని వక్రీకరించి కాపులకు దూరంచేద్దామని  తెలుగుదేశం వేసిన ఎత్తులను అంతే వేగంగా జగన్ చిత్తు చేశారు. పిఠాపురం సభలో జగన్ కాపులకు నేను అండ అంటూ ఇచ్చిన అభయ హస్తం తో వైసీపీ వర్గాలతో పాటు ఉత్తరాంధ్ర కాపులు మొత్తం ఖుషీగా ఉన్నారు.


విడమరచి చెప్పారుగా  :


                 
మా నాయకుడు జగన్ ఎపుడూ మాట తప్పలేదు మడమ తిప్పలేదు  పిఠాపురం మీటింగులో  జగన్ కాపుల రిజవేషన్లకు తాను వ్యతిరేకం కాదు అని క్లారిటీగా చెప్పేసాక టీడీపీ రాజకీయం మొత్తం అభాసుపాలైంది అని వైసీపీ కాపు నాయకులు అంటున్నారు.  దీనిపై విశాఖ వైసీపీ అధ్యక్షుడు మళ్ళ విజయప్రసాద్ మాట్లాడుతు, జగన్ పై కాపులతో సహా అన్ని వర్గాలు నమ్మకంగా ఉన్నాయని మరో మారు రుజువైందని, టీడీపీ ఇకనైనా ఈ రకమైన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ చేసారు.


మళ్ళీ అదే మాట అన్న బాబు :


జగన్ కాపుల విషయంలో ఇంత విస్పష్టంగా ప్రకటించాక కూడా టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ అదే మాటను అంటున్నారు. విశాఖ టూర్లో  బాబు జగన్ కాపుల విషయంలో మాట మార్చుతూ పోతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. కాపుల పట్ల చిత్త శుధ్ధి  టీడీపీకి ఉంది కాబట్టే అసెంబ్లీలో బిల్లు అమోదించి కేంద్రానికి పంపామని చెప్పుకొచ్చారు. కాపులకు అండగా టీడీపీ మాత్రమే ఉందన్నారు. మొత్తానికి జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ టీడీపీని మరో మారు ఇలా కలవరపరిచిందంటే జగన్ ప్రకంపనలు ఏ రేంజిలో  ఉన్నాయో అర్ధమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: