పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో ఆవేశంగా మాట్లాడతాడు. మాటకొస్తే నాకు చేగువేరా ఆదర్శం అంటాడు నాలో విప్లవ భావాలు ఉన్నాయని మాటలు మాత్రం బాగా చెబుతాడు. కానీ ఆచరణ లో మాత్రం పెట్టడు. కాపు రిజర్వేషన్స్ గురించి ఇప్పడూ ఆంధ్ర ప్రదేశ్ లో నానా రచ్చ జరుగుతుంది. అయితే ఇంత వరకు పవన్ కళ్యాణ్ నోరు తెరిసి మాట్లాడింది లేదు. ఒక పక్క జగనేమో తన అభిప్రాయాన్ని బల్ల గుద్ది చెప్పాడు. 

Image result for pavan kalyan janasena

ఈ విష‌య‌మై ఎవ‌రికి తోచిన విధంగా వారు విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. ఇప్పుడు అంద‌రి దృష్టి జ‌న‌సేనానిపై ప‌డింది. ఎందుకంటే ఆయ‌న కాద‌న్నా ప‌వ‌న్‌ను కాపు సామాజిక‌వ‌ర్గ నేత‌గానే గుర్తిస్తారు, గౌర‌విస్తారు. ఇటీవ‌ల భీమ‌వ‌రంలో ఆయ‌న ప్రసంగిస్తూ త‌న మాట‌ను మ‌న్నించి జిల్లా ప్రజ‌లు 15కు 15 సీట్లను టీడీపీ కూట‌మికి క‌ట్టబెట్టార‌ని గ‌ర్వంగా చెప్పారు. రాయ‌ల‌సీమ‌, ఉత్తరాంధ్రలో ప‌వ‌న్‌పై లేని గౌర‌వం ఒక్క ఆ రెండుమూడు జిల్లాల్లోనే ఎందుకో ఆయ‌న చెబితేనే బాగుంటుంది.

Image result for jagan

ఇక్కడ త‌న సామాజిక‌వ‌ర్గం వారే త‌న బ‌ల‌మ‌ని ఈ మాట‌ల ద్వారా ప‌వ‌న్ చెప్పక‌నే చెప్పారు. ప‌వ‌న్ విప్లవ‌క‌ర ప్రసంగాల సంగ‌తి అటుంచితే.. సొంత సామాజిక వ‌ర్గానికి సంబంధించి రిజ‌ర్వేష‌న్లపై వైసీపీ అధినేత జ‌గ‌న్ మాదిరిగా నిర్మొహ‌మాటంగా ప్రక‌టించే ద‌మ్ము ప‌వ‌న్‌కు ఉందా అనే ప్రశ్న ప‌లువ‌ర్గాల ప్రజ‌ల నుంచి బ‌లంగా, స‌వాల్ విసిరిన‌ట్టుగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: