ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడూ కుల సమీకరణాల మీద బేస్ చేసుకొని జరుగుతుంటాయి. అయితే మన రాష్ట్రం లో కాపులు మెజారిటీ అన్న సంగతీ తెలిసిందే. ఈస్ట్ , వెస్ట్ గోదావరిలో అయితే మెజారిటీ పాపులేషన్ కాపు సామాజిక వర్గమే. అయితే ఇంతవరకు కాపుల నుంచి ఒకరు కూడా ఆంధ్ర ప్రదేశ్ సీఎం కాలేదు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు చెందిన వారు సిఎమ్ అయ్యారు తప్ప, కాపులకు చెందినవారు మాత్రంకాలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు ఆ అవకాశం కాపులకు వచ్చింది కానీ అంత మెజారిటీ ఓట్లు వున్నా, ప్రజారాజ్యం పార్టీ నిలబడలేదు.

Image result for pavan kalyan janasena

ప్రజారాజ్యం పోయి పోయి కాంగ్రెస్ లో కలవకుండా వుంటే ఇప్పటికి పరిస్థితి ఎలా వుండేదో కానీ, అలా కలవడం వల్ల జనసేనను  కాపు జనాలే పూర్తిగా నమ్మలేని పరిస్థితి తెచ్చారన్నది వాస్తవం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా మూడున్నరేళ్లు తెలుగుదేశం పల్లకీ మోసారు. మళ్లీ మోస్తారని, మోయరనీ గ్యారంటీలేదు. అదీకాక, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లీడ్ లో లేరు. చంద్రబాబు, జగన్ నే లీడ్ లో వున్నారు. అంటే 2019లో కూడా కాపు వ్యక్తి సిఎమ్ అయ్యే అవకాశాలు తక్కువ. ఈ కోరిక ఇప్పటిలో కల గానే మిగిలి పోవాల్సిందే. 

Image result for pavan kalyan janasena

ఇక రిజర్వేషన్స్ గురిమ్చి చెప్పాలంటే అది రాష్ట్ర పరిథిలోది కాదని అందరూ అంటున్నదే. పైకి గట్టిగా అనడంలేదు అంతే. జగన్ మాత్రమే ఆ కుండబద్దలు కొట్టింది. కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప సాధ్యంకాదని అందరూ చెబుతున్నదే. కానీ దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఒక విధమైన రిజర్వేషన్ ఉద్యమం నడుస్తోంది. పైగా భారతీయ జనతాపార్టీ మూలాలు ఇలాంటి రిజర్వేషన్లకు కాస్త వ్యతిరేకమే అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: