బీజేపీ మాత్రు సంస్థ ఆరెస్సెస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై గురి పెట్టింది. కేంద్రంలో బీజేపీతో జట్టు కట్టి నాలుగేళ్ళ పాటు అధికారం అనుభవించి ప్లేట్ ఫిరాయించడంపై గుస్సా అవుతోంది. ఇందుకు తగిన రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు  దీటైన వ్యూహాలకు ఆరెస్సెస్ పదును పెడుతోంది. సరిగ్గా బాబు పాలిస్తున్న ఏపీలోనే రణ నినాదం చేసేందుకు రెడీ అవుతోంది. విశాఖ వేదికగా ఈ నెల 10 నుంచి 12 వరకు ఆరెస్సెస్  కీలక సమావేశాలు జరగనున్నాయి.


ఓడించడమే అజెండా ?


వచ్చే ఎన్నికలలో ఏపీలో చంద్రబాబును ఓడించడమే టార్గెట్ గా  ఆరెస్సెస్ మీటింగులు జరగబోతున్నాయి.తమ వల్ల లాభపడి తమనే ఏపీ నుంచి తరిమేయాలని  చూస్తున్న టీడీపీకి గట్టిగా దెబ్బేయాలని ఆరెస్సెస్ డిసైడ్ అయినట్లుగా భోగట్టా. ఈ మూడు రోజుల మీటింగుల అందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారట. ఏపీలో ఇపుడున్న రాజకీయ  పరిస్థితులను కూడా గమనించి తగిన విధంగా ముందుకు పోయెందుకు ఆరెస్సెస్ బీజేపీకి మార్గదర్శనం చెస్తుందని టాక్.


పొత్తుల గురించి కూడా ..


ఏపీలో  వచ్చే ఎన్నికలలో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలన్నది  కూడా ఈ భేటీలో నిర్ణయిస్తారని తెలుస్తోంది. అలాగే ఆరెస్సెస్ ప్రచారక్ లు ఇకపై గ్రామాలు వెళ్ళి  అధికార పార్టీ కి వ్యతిరేకంగా జనాలలో చైతన్యం తీసుకువస్తారట. దాని వల్ల బాబుపై పూర్తి వ్యతిరేకతను పోగు చేసి ఓటమి చెందేలా చూస్తారని అంటున్నారు.

కాగా, ఈ సమావేశాలకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి భయ్యజీ జోషీ, అగ్ర నేతలు క్రిష్ణ గోపాల్, సురేష్ సోనీ తదితరులు హాజరవుతారని తెలుస్తోంది. మొత్తానికి బాబుపై యుధ్ధానికి బీజేపీ భీష్మాచార్యుడు ఆరెస్సెస్ డైరెక్ట్ గా రంగంలోకి రావడంతో బాబుకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: