క‌ర్నూలు జిల్లాలో ఘోర దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ఆలూరు మండ‌లంలోని హ‌త్తిబెళ‌గ‌ల్ కొండ‌ల‌పై కంక‌ర  కోస‌మ‌ని చేస్తున్న‌ అక్ర‌మ క్వారీయింగ్ లో జ‌రిగిన  పేలుళ్ళకు ఘ‌ట‌నా స్ధలంలోనే 12 మంది చ‌నిపోయారు మ‌రో 10 మందికి తీవ్ర గయాల‌య్యాయి. గాయాల‌పాలైన వారి ప‌రిస్ధితిని చూస్తే మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశాలు లేక‌పోలేదు. బాధితులంతా ఒడిశా, చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల‌కు చెందిన వారే. టిడిపికి చెందిన శ్రీ‌నివాస్ చౌద‌రి, అత‌ని సోద‌రుడు సువాస్ చౌద‌రి చేసుకుంటున్నారు. పేలుగు ధాటికి మృతుల శ‌రీర భ‌గాలు ముక్క‌లైపోయి చెల్లా చెదురుగా ప‌డ్డాయి. దాంతో ఘ‌ట‌నా స్ధ‌ల‌మంతా భీబ‌త్సంగా త‌యారైంది. 

నిల్వ ఉంచిన పేలుడు ప‌దార్దాలు


కొండ‌ల‌ను తొలిచి కంక‌రగా మార్చేందుకు ఓన‌ర్లు క్వారీలోనే భారీ ఎత్తున పేలుడు ప‌దార్ధాలు నిల్వ ఉంచిన‌ట్లు స‌మాచారం. అందుబాటులో ఉన్న స‌మాచారం ప్ర‌కారం 300కు పైగా ఎల‌క్ట్రిక‌ల్ డిటొనేట‌ర్లు, కిలోల లెక్క‌న గ‌న్ పౌడ‌ర్, స్ల‌ర్రీ ఎక్స్ ప్లోజివ్స్, జిలెటిన్ స్టిక్స్ లాంటి పేలుడు ప‌దార్ధాలు నిల్వ ఉంచార‌ట‌.. క్వారీ ప్రాంతంలో ఈమ‌ధ్యే గుంత‌లు త‌వ్వి పేలుళ్ళు జ‌రిపారు. అయితే కొన్ని గుంత‌ల్లో పెట్టిన మందుగుండు పేల‌లేదు. అయితే, శుక్ర‌వారం రాత్రి ఓ గ్యాస్ సిలిండ‌ర్ లీకైంది. లీకైన గ్యాస్ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌కు వ్యాపించిన‌పుడు గుంత‌ల్లో ఉన్న పేలుడు ప‌దార్ధాల‌పైన కూడా ప‌డింద‌ట‌. దాంతో డిటోనేట‌ర్లు ఒక్క‌సారిగా పేలిపోయాయి.


 గ్రామం కూడా ద‌ద్ద‌రిల్లిపోయింది


తాజాగా పెట్టిన డిటోనేట‌ర్లు, గ‌తంలో పేల‌ని డిటోనేట‌ర్లు రెండు కలిసి ఒకేసారి పేల‌డంతో చుట్టుప‌క్క‌ల ఏం జ‌రుగుతోందో ఎవ‌రికీ అర్ధం కాలేదు. దానికితోడు పేలుడు ధాటికి షెడ్ల‌లో నిల్వ ఉంచిని డిటొనేట‌ర్లు, జిలెటిన్ స్టిక్స్ లాంటివి కూడా పేలిపోయాయి. క్వారీకి దూరంగా ఉంటున్న గ్రామాశివార్లు కూడా పేలుళ్ళ‌తో దద్ద‌రిల్లిపోవ‌ట‌మే కాకుండా గ్రామాల‌కు కూడా మంట‌లు వ్యాపించాయంటే పేలుళ్ళు ఏ స్ధాయిలో జ‌రిగుంటుందో అర్ధం చేసుకోవ‌చ్చు. సరే ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత ఎటూ అధికార యంత్రాంగం క‌దులుతుంది క‌దా ? అలాగే ఇక్క‌డ కూడా అధికారుల హ‌డావుడి మొద‌లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: