ఎన్టీఆర్ బయో పిక్ క్రిష్ సారధ్యం లో శెరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది క్రిష్ కు సినిమా లు స్పీడ్ గా తీసే కెపాసిటీ ఉంది కాబట్టి ఎన్టీఆర్ సినిమాను కూడా త్వరగానే పూర్తి చేస్తాడు. అయితే ఎన్టీఆర్ సినిమా అనగానే మనకు గుర్తుకు రావాల్సింది చంద్ర బాబు ఎన్టీఆర్ వెన్నుపోటు సంఘటన. కానీ అవేమి ఈ సినిమా లో చూపించరు అని తెలుస్తుంది. ఎందుకంటే చిత్ర యూనిట్ ఏకంగా చంద్ర బాబు సలహాలను తీసుకుంటుంది. 

Image result for ntr biopic

ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితానికి సంబంధించి చంద్రబాబుకు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌ని, అందువ‌ల్లే ఆయ‌న‌తో చిత్ర యూనిట్ స‌మావేశ‌మైంద‌ని ఎల్లో మీడియా ఊద‌ర‌గొడుతోంది. అంతేకాదు సీఎం స‌ల‌హాలు తీసుకుని ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్రానికి మెరుగులు దిద్దనున్నట్టు వార్తలు వ‌స్తున్నాయి.  చంద్రబాబు స‌ల‌హాల‌తో ఎన్టీఆర్ పై సినిమా తీస్తే ఎలాగుంటుందో ప్రేక్షకులు ఇప్పటికే ఓ అంచ‌నాకు వ‌చ్చారు.

Image result for ntr biopic

నిజంగా ఎన్టీఆర్ జీవితాన్ని వాస్తవికంగా చిత్రీక‌రించాలంటే చంద్రబాబు పాత్ర ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్టీఆర్‌ను సీఎం ప‌ద‌వి నుంచి నిర్దాక్ష్యణ్యంగా తొల‌గించ‌డం, వైస్రాయ్ హోట‌ల్ ద‌గ్గర చెప్పుల‌తో దాడి, చంద్రబాబు శిబిరంలో పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలున్నట్టు రాసిన ఆంధ్రజ్యోతి జ‌ర్నలిస్టు కుట్రపూరిత పాత్రల‌కు సినిమాలో చోటు ద‌క్కిన‌ప్పుడే ప‌రిపూర్ణత ల‌భిస్తుంది. ప‌ద‌వి కోసం రాజుల కాలంలో తండ్రిని, అన్నల‌ను, మామ‌ల‌ను చంపిన వారిని చూశాంగాని, నేడు త‌న అల్లుడే త‌నను ప‌ద‌వి నుంచి దింప‌డం క‌ల‌చివేసింద‌ని ఎన్టీఆర్ వెల‌బుచ్చిన ఆవేద‌న ఆయ‌న అభిమానుల్లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఎన్టీఆర్‌ను రాజ‌కీయ రంగంలోకి చంద్రబాబే తీసుకొచ్చార‌నే రీతిలో సినిమా తీస్తే.. అంత‌కుమించిన హాస్యం, అప‌హాస్యం ఉండ‌దు.



మరింత సమాచారం తెలుసుకోండి: