చంద్ర‌బాబునాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాయ‌ల‌సీమ జ‌నాల్లో పౌష్టికాహార లోపం క‌న‌బ‌డుతుంటే, కృష్ణా జిల్లా ప్ర‌జ‌లకు మాత్రం కొవ్వు ఎక్కువైంద‌న్నారు.  జిల్లాలోని విస‌న్న‌పేట మండ‌లంలోని తాత‌కుంట్ల గ్రామంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ, కృష్ణా జిల్లా ప్ర‌జ‌లు అధిక భ‌రువు పెరిగిపోయి  కొవ్వుతో ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు వ్యంగ్యంగా అన్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా టిడిపి మాజీ ఎంఎల్ఏ స్వామిదాసును చూప‌టంతో అంద‌రు ఒక్క‌సారిగా న‌వ్వేశారు. 


30 శాతం మంది మాత్ర‌మే బ‌దులిస్తున్నార‌ట‌


త‌ర్వాత స్ధానికుల‌పై మండిప‌డ్డారు. తాను 24 గంట‌లూ క‌ష్ట‌ప‌డుతుంటే, రాష్ట్రాన్ని ప్ర‌గ‌తిప‌థంలో న‌డ‌ప‌టానికి కృషి చేస్తున్న‌ట్లు చెప్పారు. స‌మ‌స్య‌లు తెలుసుకుందామ‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లులో లోపాలు తెలుసుకుందామ‌ని ఫోన్  చేస్తుంటే ఎవ్వ‌రూ బ‌దులివ్వ‌టం లేద‌న్నారు. తాను ఫోన్లు చేస్తుంటే కేవ‌లం 30 శాతం మంది మాత్ర‌మే బ‌దులిస్తున్న‌ట్లు చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ప్ర‌తీ ఒక్క‌రూ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుంటున్నా ప్ర‌భుత్వం నుండి వ‌చ్చే ఫోన్ల‌కు మాత్రం బ‌దులివ్వ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ట‌. దాంతోనే అర్ధ‌మ‌వుతోంది ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఎంత స‌వ్యంగా అమ‌ల‌వుతున్నాయో ?


ఇంత వ్య‌తిరేక‌త ఉందా జ‌నాల్లో ?

Image result for chandrababu teleconference

ప్ర‌భుత్వంపై  80 శాతం జ‌నాల్లో పూర్తి సంతృప్తి ఉంద‌ని  చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే . చంద్ర‌బాబు చెబుతున్న‌దే నిజ‌మైతే స్వ‌యంగా సిఎం ద‌గ్గర నుండి ఫోన్ వ‌స్తే జ‌నాలు ఎందుకు బ‌దులివ్వ‌రు ?  తాను స్వ‌యంగా ఫోన్ చేసినా జ‌నాలు బ‌దులివ్వ‌టం లేద‌ని చంద్ర‌బాబే చెప్పుకుంటున్నారంటే అర్ధ‌మేంటి ?  ముఖ్య‌మంత్రితో ఫోన్లో మాట్లాడ‌టాన్ని జ‌నాలు ఇష్ట‌ప‌డ‌టం లేదంటే ప‌థ‌కాల అమ‌లుపై జ‌నాల్లో ఎంత వ్య‌తిరేక‌త ఉందో తెలిసిపోతోంది. కాక‌పోతే త‌మ‌లోని వ్య‌తిరేక‌త‌ను జ‌నాలు నేరుగా చంద్ర‌బాబు ముందు వ్య‌క్తం చేయ‌లేక ఫోన్ల‌కు బ‌దులివ్వ‌టం లేద‌ని అర్ధం కావ‌టం లేదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: