పవన్ కళ్యాణ్ స్పీచ్ లు అర్ధం కావని, మాట మీద నిలకడ ఉండదని తరుచు వినిపిస్తున్న మాటలు. అయితే పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో కూడా తప్పులు ఉండటం తో పవన్ ప్రెస్ నోట్ కూడా ఎవరికీ అర్ధం కాదని సెటైర్లు వేస్తున్నారు. తమిళనాడులో సీనియర్ నాయకుడు కరుణానిధి ప్రస్తుతం ఆరోగ్యం విషమించి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబునాయుడు స్వయంగా పరామర్శకు కూడా వెళ్లి వచ్చేసిన తర్వాత...  కరుణానిధి ఆరోగ్యం గురించి తాను చింతిస్తున్నట్లుగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు పవన్ కల్యాణ్. ఆయన త్వరగా కోలుకోవాలని కూడా అందులో వాంఛింఛారు.

Image result for pavan janasena

'కరుణానిధి చిరంతనంగా మన మధ్య ఉండాలి' అనే హెడింగ్ తో ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మామూలు పార్టీ అలవాటు ప్రకారం కాకుండా 13 లైన్లు మాత్రమే ఉన్న ప్రెస్ నోట్ అది. అదే ప్రెస్ నోట్ ఇంగ్లిషులో కూడా విడుదల చేశారు. లాంగ్ లివ్ కరుణానిధి విత్ అజ్ అని దానికి టైటిల్ పెట్టారు. నిజానికి ఇదే ప్రెస్ నోట్ ను తమిళంలో కూడా విడుదల చేశారు. అయితే దానిని తెలుగులోకి అనువదించడంలో మాత్రం అత్యుత్సాహానికి పోయారు.

Image result for pavan janasena

చిరస్థాయిగా కరుణానిధి మనతో ఉండాలి అని చెప్పదలచుకున్న వాళ్లు కాస్తా.. ‘‘కరుణానిధి చిరంతనంగా మన మధ్య ఉండాలి’’ అంటూ సెలవిచ్చారు. చిరంతనంగా అంటూ కాస్త బరువైన పదాలు వాడితే.. మరింత డెప్త్ ఉంటుందని వాళ్లు అనుకున్నారేమో గానీ.. ఆ పదానికి ఉన్న అర్థం వేరు. చిరస్థాయిగా అనే అర్థం అందులో లేదు. చిరంతనమైన అనే పదానికి పాత, పురాతనమైన, జీర్ణమైపోయిన, చీకిపోయిన.. వంటి నిఘంటు అర్థాలున్నాయి. ఇలాంటి భాషా పైత్యాన్ని ప్రదర్శించడం వల్ల...  కరుణానిధి కోలుకోవాలని కోరే ప్రెస్ నోట్ లో దురర్థాలు కూడా వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: