తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఏపీలో వేల కోట్ల అతి పెద్ద కుంభకోణం జరిగిందంటూ బీజేపీ రాజ్య సభ సబ్యుడు జీవీఎల్ నరసిమ్హారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో 53 వేల కోట్ల రూపాయలు దారి మళ్ళాయని ఆరోపించారు. ఆ సొమ్ముని టీడీపీ ప్రభుత్వం 53 వేల కోట్ల పీడీ ఖాతాలలో వేసిందని, ఇంత కంటే పెద్ద స్కాం  దేశంలోనే లేదని ఘాటుగా కామెంట్స్ చేసారు.


కాగ్ నుంచి తప్పించుకోలేరు :


ఎక్కడ తప్పించుకున్నా  కాగ్ నివేదిక ఈ భారీ కుంభకోణాన్ని బయటపెడుతుందని, అపుడైనా టీడీపీ బండారం బద్దలవడం ఖాయమని అన్నారు. టీడీపీ  ప్రభుత్వం దారి తప్పిన ఆ 53 వేల కోట్ల రూపాయల విషయమై శ్వేతపత్రం విడుదల చేయాలని జీవీఎల్ డిమాండు చేశారు. పీడీ ఖాతాలలో 53 వేల కోట్లు ఉండగా  బయట నుంచి అప్పులు ఎందుకు తెస్తున్నారని  బాబు ప్రభుత్వాన్ని  అయన నిలదీశారు.


జవాబు ఏదీ :


తాను అవినీతి గురించి ప్రశ్నిస్తే జవాబు చెప్పకుండా టీడీపీ నాయకులు డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారని జీవీఎల్ ఫైర్అయ్యారు  దమ్ముంటే తాను అడిగిన వాటికి సమాధానం  చెప్పాలంటూ ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు.  అలాగే ఈ పీడీ ఖాతాల విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. దేశంలోనే అతి పెద్ద కుంభకోణం ఇదని, బీహార్లో లాలూకి పట్టిన గతే టీడీపీకి పడుతుందని కూడా వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి చూస్తూంటే జీవీఎల్ అడిగిన ప్రశ్నలకు టీడీపీ బాగానే కలవరపడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: