ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి  వైసీపీలో చేరనున్నారు. ఈ రోజు ఆయన పిఠాపురం పాదయాత్రలో ఉన్న జగన్ ని కలిశారు. దాంతో ఆయన త్వరలో వైసీపీ లో జాయిన్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. నిన్ననే బీజేపీ రాష్త్ర కార్యదర్శిగా ఆయనను  ఆ పార్టీ నియమించింది. ఒక రోజు తిరగ కుండానే  షాక్ ఇస్తూ రాం కుమార్ జగన్ ని కలవడం విశేషం.


ఆ సీటు కోసం పోటా పోటీ :


నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. పోయిన ఎన్నికలలో ఎంపీ, మెజారిటీ  ఎమ్మెల్యే  సీట్లు  గెలుచుకుని టీడీపీకి సవాల్ విసిరింది. వచ్చే ఎన్నికలలో కూడా నెల్లూరు జిల్లా ఫ్యాన్ పార్టీదేనని భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో  పలువురు సీనియర్ నాయకులు ఈ వైపుగా చూస్తున్నారు. ఈ మధ్యనే మాజీ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి  జగన్ ని కలిసారు. ఆయన కూడా వైసీపీలో చేరాలనుకుంటున్నారు. వెంకటగిరి సీటు ఆశిస్తున్నారు.


ఇపుడు నేదురుమల్లి తనయుడు అదే సీటు కోరుతున్నారు. ఈ ఇద్దరితో పాటు ఆల్రేడీ అక్కడ వైసీపీ ఇంచార్జ్ కూడా ఉన్నారు. మొత్తానికి నెల్లూరు జిల్లాలో వైసీపీ కిటకిటలాడుతోంది. జగన్ ఎవరికి ఏ సీటు ఇస్తారో కానీ మస్త్ మస్త్ గా ఆ జిల్లా రాజకీయం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: