విశాఖ రైల్వే జోన్ అన్నది ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం. దీనికోసం ఈ మూడు జిల్లాల ప్రజానీకం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. జోన్ వల్ల  భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని, బతుకులు మారుతాయని అనుకుంటున్నారు. అటువంటి జోన్ నాలుగున్నరేళ్ళుగా  మూలకు పడి ఉంది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి  రాజకీయ పార్టీలు జోన్ కూత పెట్టడం మొదలు పెట్టాయి. జోన్ కోసం పోరాటంలో రెండు పార్టీలు ముందున్నాయి.


హోదా కంటే కూడా సెంటిమెంట్ :


ప్రత్యేక హోదా అన్నది ఎంత అరచినా వచ్చెట్లు కనిపించడం లేదు. ఒక వేళ వచ్చినా దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అదే రైల్వే జోన్ అయితే  డైరెక్ట్ గా  ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇండైరెక్ట్ గా కూడా అనేక మందికి ఫుడ్  పెట్టే సత్తా కలిగిన ప్రాజెక్ట్ రైల్వే జోన్. బాగా వెనకబడిన  ఉత్తరాంధ్రకు ఎంప్లాయ్మెంట్ ఈ స్థాయిలో జనరేట్ చేసేది మరొకటి లేదు. జోన్ ఎవరు తెస్తే వారి మెడలో వరమాల వేసేందుకు ఉత్తరాంధ్ర జనం రెడీగా ఉన్నారు. దాంతో అటు బీజేపీ, ఇటు టీడీపీ కూడా జోన్ బాట పట్టేశాయి.


క్రెడిట్ కోసం పరుగు :


రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని ఇలా అన్నారో లేదో అలా విశాఖ బీజేపీ నాయకులు థాంక్స్ టూర్ ని పెట్టి మరీ డిల్లీ వెళ్ళి కేంద్ర   మంత్రులను సన్మానించి వచ్చారు. జోన్ మెమే తెస్తున్నామని చెప్పుకునేందుకే  ఈ హడావుడి. వచ్చే నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విశాఖ పర్యటనలో ఆయన చేత మరో మారు ప్రకటన చేయించి ఎన్నికల గోదాలోకి దిగాలన్నది బీజేపీ ఆలోచన.


టీడీపీ రెడీ :


ఇలా బీజేపీ జోన్ పట్టుకుని ఓట్ల వేటకు సిద్ధం  కావడంతో టీడీపీ కూడా రేసులోకి వచ్చింది. మా పోరాటాల వల్లనే జోన్ వస్తోందని చెప్పుకునేందుకు ఆ పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ రోజు డీల్లీ బాట పట్టారు. రేపు (మంగళవారం) వారంతా డిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో పాటు, ఇతర మంత్రులను కలసి జోన్ ఇవ్వాలని డిమాండ్ చెస్తారట. ఒకవేళ కేంద్రం జోన్ ప్రకటిస్తే మా వల్లనే అయిందని చెప్పుకోవడానికే టీడీపీ ఆరాటం. ఇలా రెండు పార్టీలు జోన్ కోసం పరుగులు పెడుతూ జనంలో ఉన్న సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి. ఇంతకీ జోన్ వస్తుందా, వస్తే ఎపుడు అన్న ప్రశ్నకు మాత్రం ఈ రెండు పార్టీల వద్ద జవాబు అయితే లేదు. అదే పాలిట్రిక్స్ మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: