ఎన్నికలు వస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కి టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే టిడిపి అధినేత చంద్రబాబుకి మతిపోతుంది. మరిముఖ్యంగా గత కొంత కాలం నుండి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్న కాపు బీసీ ఓట్లు దూరమైపోతాయ్ ఏమో అన్న ఆందోళన చంద్రబాబు మొహం లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో కాపు..బీసీ ప్రజలకు దగ్గరయ్యేలా ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో ముందుగా రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పై ప్రత్యేకమైన దృష్టి సారించారు బాబు గారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అంటే ముందుగా గుర్తుకు వచ్చే రాజకీయ నేత పేరు ఆమంచి కృష్ణమోహన్.

Related image

రాజకీయాలలో.. ప్రజలకు మంచి చేయడంలో ఆమంచి కృష్ణమోహన్ గారికి మించిన వారు మరొకరు లేరు అన్న విషయం ఆ జిల్లాలో ఏ వర్గ ప్రజలను అడిగిన చెబుతారు. ఇందుమూలంగానే 2001వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని యోధుడిగా ప్రకాశం జిల్లాలో ఓ వెలుగు వెలుగుతున్నరు ఆమంచి కృష్ణమోహన్. ఈ క్రమంలో ఇంతటి చరిష్మా కలిగిన నాయకుడిని ముందుగా ఆశ్రయిస్తే కాపులు..బిసి వర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీపై ఉన్న అపోహ తొలగిపోతుందని రాజకీయ చాణిక్య చంద్రబాబు ఆలోచించి చేనేత దినోత్సవం నాడు ఆమంచి కృష్ణమోహన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న కాపు -బిసి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Image result for amanchi krishna mohan

2014 ఎన్నికలలో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి టిడిపి-వైసిపి నాయకులకు చుక్కలు చూపించి గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ..రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ అటువంటి వాతావరణాన్ని తన నాయకత్వంలో  ప్రకాశం జిల్లాలో ఎక్కడా కూడా కలగకుండా తనదైన శైలిలో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడ్డారు.

Image result for amanchi krishna mohan

అయితే ప్రస్తుతం టీడీపీ పార్టీపై..తనపై కాపులలో ఉన్న అపోహలు తొలగించుకోవడానికి ఎన్నికల ముందే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల ద్వారా కాపు సామాజిక వర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా తాజాగా జరగబోయే చేనేత దినోత్సవం నాడు కాపు సామాజికవర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్ గారితో ముందుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు చంద్రబాబు. మరోపక్క చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు పార్టీలకతీతంగా.. కులాలకతీతంగా కేవలం జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు...అయితే కాపులు మిగతా కులాల విషయంలో తన ద్వారా దగ్గర అవుదామని అనుకొంటున్న చంద్రబాబు ప్రయత్నాలకు ఆమంచి గారు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. మొత్తంమీద రాబోయే ఎన్నికలలో అధికారం కోసం అప్పుడే చంద్రబాబు అనధికారికంగా ప్రచారం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: