మహిళలంటే ఎంతో గౌరవం అని రోజూ చెప్పుకునే చంద్రబాబు వారిని పోలీసులతో అతి దారుణంగా కొట్టించి అరెస్టులు చెయడమేంటని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. నిన్న (సోమవారం) విజయవాడలో మధ్యాహ్న భోజన  మహిళా కార్మికులు ప్రభుత్వ విధానాలకు నిరసగా ఆందోళన చేపడితే పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడాన్ని జగన్ ఖండించారు. ఈ మేరకు ఈ రోజు ట్విట్టెర్ లో ట్వీట్ చేసిన జగన్ బాబు సర్కార్ వైఖరిని కడిగిపారేశారు.


అక్కడ అలా చేస్తారు :


మహిళలు అంటే ఎంతో మర్యాద అన్నట్లు పోజులు కొడతారని, విజయవాడలోనే మహిళా పార్లమెంట్ అంటూ పెట్టి ఆర్భాటాలకు పోతారని జగన్ అన్నారు. మరి అదే మహిళలు  తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మాత్రం  పోలీసులను పెట్టి కొట్టిస్తారంటూ ఫైర్ అయ్యారు. వారేం తప్పు చేశారని అంత దురుసుగా వ్యవహరించారని జగన్ ప్రశ్నించారు. తమ సమస్యలు చెప్పుకోవడమే నేరమా అని నిగ్గదీశారు


ప్రైవేటుకు అప్పగించేందుకే :


మధ్యహ్న భొజన పధక కోసం అప్పులు చేసి మరీ ఆరు నెలలుగా మహిళా కార్మికులు భొజనం సమకూరుస్తున్నారని జగన్ గుర్తు చేశారు. సరిగ్గా వేతనాలు ఇవ్వకున్నా, సరకులు సైతం సమకూర్చకున్నా ఇదంతా చేస్తూ వచ్చిన వారిపైన కక్ష పూనినట్లుగా ప్రభుత్వం ప్రవర్తించడం బాధాకరమన్నారు. ఈ పధకం ప్రైవేట్ ఎజెన్సీలకు అప్పగించేదుకే బాబు తహతహ లాడుతున్నారని  అన్నారు. మహిళా కార్మికులకు వైసీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: