సొంత పార్టీలో దొంగలు దోపిడీదారులను పెట్టుకుని అవినీతి లేని పాలన అందిస్తున్నానంటూ మన చంద్రబాబు గారు ఊదరగొడతారు. దర్జాగా కబ్జాలు చేసే వాళ్ళను చూశాం, కాల్ మనీ రాకెట్లనూ చూశాం, తాశీల్దార్ లాంటి అధికారులను లాగేసి పడేసిన స్టోరీలూ  విన్నాం, ఇపుడు చీరల దొంగలనూ చూస్తున్నాం. లోకాన్ని చల్లగా చూసే శ్రీ కనక దుర్గమ్మ వారి సన్నిధిలో వేల రూపాయలు విలువ చేసే చీర మాయం కావడం సంచలనమైతే ఆ చీర దొంగ ఏకంగా పాలకమండలి మెంబర్ కావడం వింతలకే వింత.


మంచోళ్ళే ఉన్నారుగా :


దేవుని సన్నిధానంలో పాలన అంటే పూర్తిగా ఆధ్యాత్మికంగా సాగాలి. కానీ కాసులకు కక్కుర్తి పడే వాళ్ళనూ, పైరవీగాళ్ళను తీసుకువచ్చి కమిటీలలో వేస్తే ఇలాగే ఉంటుంది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విజయవాడ దుర్గాదేవి ఆలయం టీడీపీ పాలనలో తరచూ పత్రికలకు ఎక్కుతోంది. అప్పట్లో క్షుద్ర పూజలు అంటూ ఓ స్టోరీ నడచింది. ఇపుడు ఏకంగా చీరలే మాయమవుతున్నాయి.


ఆ మెంబర్ సస్పెండ్ :


చీరల దొంగగా గుర్తించిన పాలకమండలి మెంబర్ సూర్యకుమారిని సస్పెండ్ చేస్తూ ఆలయ కమిటీ చైర్మన్ గౌరంగబాబు ఈ రోజు యాక్షన్ తీసుకున్నారు. సీ సీ పుటేజ్ తో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా మెంబర్ సూర్యలత చీర తీశారని చెప్పడంతో ఈ చర్యలకు ఉపక్రమించారు. దీనిపై సీఎం చంద్రబాబు ఓ వైపు తలంటిన సంగతి విధితమే. మరి తాను పెట్టిన కమిటీ నిర్వాకం చూసి బాబు ఇపుడు గగ్గోలు పెట్టినా  ఫలితం లేదుగా. మొత్తానికి ఒక్క చీర మాయంతో కమిటీ పరువు గంగలో కలసిపోయింది. పనిలో పనిగా సర్కార్ పరువూ పోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: