ఆంధ్రరాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసి కేంద్రంలో దర్జాగా కూర్చున్న మోడీ సర్కారుకి ఇటీవల పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు ఇచ్చిన షాక్ కి మోడీకి దిమ్మతిరిగే పోయినట్లు ఉంది. ఈ క్రమంలో చంద్రబాబుపై పగ తీర్చుకోవడానికి ఇబ్బందులపాలు చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవ పెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్తో స్పీచ్ వేసినట్లు సమాచారం.

Image result for MODI

ఈ క్రమంలో చంద్రబాబుపై కోపంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అన్నివిధాల సహకరించడానికి మోడీ రెడీ అయిపోయారు. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేసిన విషయం మనకందరికీ తెలిసినదే..ఈ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి అడిగిందే తడవుగా ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకున్నారు.

Image result for MODI KCR

వీరిద్దరు గంటకు పైగా చర్చించుకున్నారు. ఇందులో తెలంగాణలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణలో జోనల్ వ్యవస్థ - కొత్త జిల్లాల ఏర్పాటు వంటి అంశాలు కీలకమైనవి. వీటికి కేంద్రం నుంచి అనుమతి తప్పక కావాలి. తాజా పర్యటనలో అది ఫలించి కేంద్రం జోనల్ వ్యవస్థకు అంగీకారం తెలిపింది. ఇది తెలంగాణకు శుభపరిణామం. దీని ద్వారా తెలంగాణలో అన్నీ పనులు చకచక జరిగిపోతాయి. కేసీఆర్ అడిగిందే తడవుగా ఆయన డిమాండ్లను అంగీకరించడం వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇబ్బందుల పాలు చేయడమేనని కొందరు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Image result for MODI KCR CHANDRABABU

మరోపక్క కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఎలా నడిపించాలో చంద్రబాబుకు తెలుసని అంటున్నారు టిడిపి నాయకులు. కేంద్రంలో అధికార పీఠంపై కూర్చుని అన్ని రాష్ట్రాలకు సంబంధం చేయాల్సిన మోడీ ఈ విధంగా వ్యవహరించడం వల్లే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఆలస్యమవుతుందని సంచలన కామెంట్ చేశారు టిడిపి నాయకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: