ఈ రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి మీడియా అనేది ఖచ్చితంగా అవసరం. ఇప్పడూ ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కొక్క రాజకీయ పార్టీకి కొన్ని మీడియా లు సపోర్ట్ చేస్తుంటాయి. అవి భహిరంగ రహస్యాలు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా మీడియా సపోర్ట్ ఎంత అవసరమో వేరే చెప్పాల్సిన పని లేదు. జనసేన అధినేత పవన్‌ కూడా సొంత మీడియా సంస్థ పెడతాడని కొన్నిరోజుల క్రితం ప్రచారం జరిగింది.

Image result for pavan janasena

ఈమధ్య ఓ పక్షపత్రిక ప్రారంభించాడు. అయితే పార్టీ అంతర్గత పత్రిక హోమ్‌ మేగజైన్‌ కావొచ్చు. ఇలా కాకుండా న్యూస్‌ పేపర్‌, టీవీ ఛానెల్‌ జనసేనకు అవసరం. ప్రస్తుతం ఆ కొరత తీరిందేమోననిపిస్తోంది. ఎందుకంటే 'ఆంధ్రప్రభ' యజమాని ముత్తా గోపాలకృష్ణతోపాటు కుటుంబం మొత్తం తాజాగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంది. గోపాలకృష్ణతోపాటు ఆయన కుమారులు శశిధర్‌, గౌతమ్‌ పార్టీలో చేరారు. శశిధర్‌ ఇదివరకు కాకినాడలో కుటుంబ వ్యాపారాలు చూసుకునేవాడు.

Image result for pavan janasena

ముత్తా గౌతమ్‌ ఆంధ్రప్రభ ఎండీగా నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. గోపాలకృష్ణను పవన్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా నియమించారు. గోపాలకృష్ణ ఈ తరంవారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఎన్టీఆర్‌ హయాంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. కాకినాడలో ఇది పెద్ద రాజకీయ కుటుంబం. ఈ విధంగా ఆంధ్ర భూమి పత్రిక పవన్ కు సపోర్ట్ చేయనున్నదని అర్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: