గాంధీజీ ఇది ఒక పేరు మాత్రమే కాదు భారత దేశ ప్రజలు గుండె చప్పుడు అని చెప్పొచ్చు. బ్రిటిష్ వారితో పోరాడి దేశ ప్రజలకు స్వేచ్చా వాయువులను ప్రసాదించిన జాతి పిత.  20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్ (CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి,ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. 

Image result for gandhiji

సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యనూ, బ్రిటిష్ సత్కారాలనూ తిరస్కరించడం. వీటివల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్థిక వ్వవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానమూ, ఆత్మ విశ్వాసమూ వెల్లి విరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం ఆన్నింటికంటే ముఖ్యమైన ఫలితం.

Image result for gandhiji

అహింసను కనిపెట్టినది గాంధీజీ కాదుగాని, అహింసను భారీస్థాయిలో రాజకీయాలలో మొదట ఉపయోగించిన వ్క్యక్తి గాంధీజీ. అహింస సిద్ధాంతం భారతీయ అధ్యాత్మిక ఆలోచనా విధానంలోను మరియు హిందు, బౌద్ధ, జైన, యూదు, క్రైస్తవ మతాలలో పలుమార్లు పేర్కొనబడింది. గాంధిజి తన విలువలను మరియు జీవన విధానాన్ని తన ఆత్మకథలో వివరించారు. అహింసను ఆచరించాలంటే గొప్ప నమ్మకం మరియు ధైర్యం కావాలని అయితే ఈవి అందరిలో లేవని గ్రహించారు. అందుకే అహింస అందరికి పాటించటం కష్టం అని, ముఖ్యంగా పిరికితనాన్ని కప్పివుంచటానికి వాడరాదు అని, ఒకవేళ పిరికితనం మరియు హింస రెండింటిలో ఒకటి ఎన్నుకోవలసినప్పుడు తను హింసను ఎన్నుకోవలసిందిగా సలహా ఇస్తానన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: