ఎన్నికలు వస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలలో సర్వేల గోల మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో నువ్వానేనా అన్నట్టుగా టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది. అయితే ఆంధ్రరాష్ట్రంలో కి వచ్చేసరికి తాజాగా ఇటీవల ఓ జాతీయ మీడియా ఛానల్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఓ జాతీయ మీడియా చేసిన ఈ స‌ర్వేలో ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు 40 శాతం త‌గ్గిపోయింది. దీనికి గ‌ల కార‌ణాల‌ను కూడా స‌ర్వే సంస్థ‌ వెల్ల‌డిచింది. చంద్ర‌బాబు స‌ర్కార్ విధానాలు, కుల రాజ‌కీయ‌మేన‌ని జాతీయ మీడియా ఛానెల్‌ వెల్ల‌డించింది.
Image result for jagan chandrababu
2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డం, అలాగే, రైతు రుణ‌మాఫీ 84 వేల కోట్లు ఉంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు 11వేల కోట్ల‌ను మాత్ర‌మే చంద్ర‌బాబు మాఫీ చేశార‌ని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా, 2014 ఎన్నిక‌ల్లో 600 హామీల మోస‌పూరిత వాగ్ధానాల‌తో అధికారాన్ని చేప‌ట్టిన చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేల‌ను డ‌బ్బు మూట‌లు చూపి కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. మరోపక్క ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైఎస్ జగన్ తాను తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర తో ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను అమాంతం పెంచడంతో కూటమిగా ఉన్న టిడిపి-బిజెపి-జనసేన పార్టీలు మూడుగా చీలిపోయాయి.

ఈ క్రమంలో తన పాదయాత్రను ప్రజలకు దగ్గరగా ఉండేలా చూసుకుంటూ వారి బాధలను ఓపికగా వింటూ రాబోయే రోజులలో మంచి జరుగుతుందని భరోసా ఇస్తూ ముందుకు సాగడం తో రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలు వైయస్ జగన్ చెబుతున్న ప్రతి హామీలను మాటలను వింటూ...జగన్ అధికారంలోకి వస్తేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్ముతున్నారు అదే సర్వేలో తేలింది.
Related image
ఈ క్రమంలో వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో వైసీపీ 140 ఎమ్మెల్యే, 20 – 22 ఎంపీ సీట్ల‌తో ఏపీలో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రిస్తుంద‌ని, టీడీపీ 20 నుంచి 25 ఎమ్మెల్యే సీట్లు, ఇత‌రులు 5 నుంచి 10 సీట్లు మాత్ర‌మే గెలుచుకోగ‌ల‌ర‌ని స‌ర్వే తేల్చి చెప్పింది. మొత్తంమీద చూసుకుంటే వచ్చేఎన్నికలలో  ఆంధ్రరాష్ట్రంలో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని జగన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని..ఆంధ్ర రాష్ట్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జాతీయ మీడియా ఛానల్ సర్వేలో తేలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: