అటు బాక్సైట్ కత్తులు, ఇటు అదీవాసీ ఉత్సవాలు,  ఓ వైపు ప్రేమ చూపిస్తూనే మరో వైపు  కత్తులు  దూసే వైఖరి. దీన్ని సహించమంటోంది మన్యం. ఏపీ సీఎం చంద్రబాబు ఏజెన్సీ టూర్ ను అడ్డుకుంటామంటున్నారు ప్రజా సంఘాల నాయకులు.బాక్సైట్ పై మొన్న కేంద్రం అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించినా ఏపీ సర్కార్ కనీసంగా స్పందించకపోవడాన్ని గిరిజన సంఘాలతో సహా అంతా తప్పు పడుతున్నారు. దీనిపై  బాబు స్పష్టత ఇచ్చి తీరాలంటున్నారు.


ఆ జీవో ఏమైంది :


బాక్సైట్ పై ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా, అధికారంలో ఉన్నపుడు మరోలా  టీడీపీ వ్యవహరిస్తూ వస్తోంది. బాబు 2014లో సీఎం కాగానే జీవో నంబర్ 97ని జారీ చేస్తూ బాక్సైట్ తవ్వకాలకు పచ్చ జెండా ఉపారు. అప్పట్లో ఏజీన్సీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలూ వైసీపీ వారే. దాంతో వారంతా కలసి తీవ్రంగా వ్యతిరేకించడంతో బాబు దాన్ని అబియెన్స్ లో పెట్టారు. కానీ ఇంతవరకూ రద్దు చేయలేదు. దీనిపైన ఎన్ని పోరాటాలు చేసినా జీవో అలాగే ఉండిపోయింది.


దాగుడుమూతలా :


అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండూ కలసి దాగుడు మూతలు ఆడుతూ ఏజెన్సీ బతుకులను చిద్రం చేస్తున్నారని గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. బాబుకు నిజంగా  ఆదీవాసీలపై ప్రేమ ఉంటే ఆ జీవో 97 ను ముందు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అపుడే ఏజెన్సీలో అడుగుపెట్టాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ సర్కార్ ఆదీవాసీ దినోత్సవాన్ని ఈ రోజు  ఘనంగా జరిపేందుకు  పాడేరులో ఏర్పాట్లు చేసింది.

బాబు హాజరవడమే కాదు. 250 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. మరో వైపు  బాక్సైట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసన గా ప్రజా సంఘాలు బ్లాక్ డే పాటిస్తున్నాయి. మొత్తానికి ఈ రోజు బాబు టూర్ హై టెన్షను క్రియేట్  చేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: