నీటికీ, చేపకు ఉన్న సంబంధం ఎలాంటిదో రాజకీయనాయకుడికీ, సమస్యలకూ అలాంటి బంధమే ఉంటుంది. మరి కొత్త పూజారి చినబాబుకు ఈ విషయం అర్ధం కానట్లుంది. అందుకే అన్ని సమస్యలూ తీర్చేస్తామంటున్నాడు. అంతేనా 2024 నాటికి ఏపీలో నిరుద్యోగులు ఉండరని కూడా ఢంకా భజాయిస్తున్నాడు. బాబు సర్కార్ ఒక్క నిరుద్యోగీ లేకుండా చేస్తుందట. అందుకోసం కంకణం కూడా చేయించి మరీ  చేతికి కట్టుకుందంట.


హామీలుఏమిస్తారో :


పోయిన ఎన్నికలలో నిరుద్యోగుల ఓట్ల కోసం బ్రుతి అంటూ పెద్ద హామీ ఇచ్చి అప్పనంగా యూత్ ఓట్లు అన్నీ కొల్లగొట్టారు తండ్రీ కొడుకులు. నాలుగున్నరేళ్ళు అయినా ఆ హామీని అలాగే ఉంచేసి ఆర్నెల్ల ముందు అపుడే నిద్ర లేచినట్లుగా వేయి రూపాయలు బ్రుతి  అంటూ భారీ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఇలా మరో మారు ఓట్ల వేటకు రెడీ అవుతున్న టైంలో అసలు నిరుధ్యోగులే లేకుండా చేస్తానంటూ జూనియర్ బాబు బయల్దేరారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఏపీలో నిరుద్యోగి లేక, సమస్యలూ లేకపోతే మీ మ్యానిఫేస్టోలో ఏం పెట్టి ఒట్లడుగుతావ్ చినబాబు అంటే జవాబు ఉంటుందా మరి.


ఆ పాట ఆపరుగా :


జూనియర్ బాబు మంత్రి అయి ఏణ్ణర్ధం కావస్తోంది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ మాట్లాడితే చాలు లక్ష ఉద్యోగాలు అంటూ పాట పాడేస్తున్నాడు. ఇప్పటికి ఎన్ని ఇచ్చారో తెలియదు కానీ 2019 నాటికి లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని శపధం చేస్తున్నాడు లోకేష్ బాబు. మరి 2019 మరో ఆరు నెలలలోనే ఉందన్న ద్యాస ఉందో లేదో కానీ టార్గెట్ అదేనంటున్నాడు. పోనీ అలాగే అనుకున్నా ఒక్క ఐటీ జాబ్స్ తో ఏపీ కరవు తీరుతుందా, మొత్తం నిరుద్యోగులే ఉండకుండా పోతారా ఏంటి.  

విశాఖలో ఈ రొజు మీడియాతో మాట్లాడుతూ, ఐటీకి విశాఖ కేరాఫ్ అన్నారు. మంత్రి లోకేష్. ఇక్కడే ఐటీ అభివ్రుధ్ధి చెందుతోందని కూడా చెప్పాడు.  కాపులుప్పడ ఐటీ సెజ్ లో ఐటీ కంపీనీలకు  ఓపెనింగ్స్ చేసిన చినబాబు పనిలో పనిగా సెల్ఫీలూ కూడా దిగేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: