టీడీపీ ఆర్ధిక వనరులకు వెన్ను దన్నుగా ఉన్నది ప్రైవేట్  విద్యా సంస్థల చైర్మన్ నారాయణ.. ప్రస్థుతం అయన  టీడీపీ  మంత్రిగా పని చేస్తున్నాడు . ఈ విషయం చాలా మంది కి తెలుసు అయితే జగన్ ఈ విషయం మీద బాగా దృష్టి పెట్టినట్టున్నాడు. అయితే నారాయణకు ప్రధానంగా ఆదాయం వచ్చేది మాత్రం విద్యా వ్యాపారం ద్వారానే. ఈ నాలుగేళ్లలో బాబు చల్లని చూపుతో ఈ వ్యాపారం పదింతలు పెరిగింది. అందుకే మంత్రి నారాయణపైనే తొలిదెబ్బ వేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇటీవల కార్పొరేట్ విద్యపై చాలా నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తున్నారు వైఎస్ఆర్సీ అధినేత.

Image result for jagan padayatra

నారాయణ సొంతజిల్లా నెల్లూరులో ఏకంగా 7 జూనియర్ కాలేజీలు అనుమతి లేకుండా నడుస్తున్నాయని ప్రధాన ఆరోపణ. బావగారు విద్యామంత్రి అయితే బావమరిదికి పర్మిషన్లు అవసరమా. వైఎస్ జగన్ సూచన మేరకు నెల్లూరు జిల్లాలో నారాయణ విద్యాసంస్థలకి వ్యతిరేకంగా ఓ ఉద్యమమే పురుడుపోసుకుంది. దీనికి వచ్చిన మద్దతు చూసుకుని జగన్ తన ప్రజాసంకల్ప యాత్రలో ఇదే అంశంపై ఫోకస్ పెంచారు. అడుగడుగునా విద్యావ్యాపారంపై మండిపడుతున్నారు. 

బాధితులంతా ఏకమై జగన్ కి మద్దతు తెలిపితే ఫలితం ఒక రేంజ్ లో ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి ఊరిలో, ప్రతి కుటుంబం నంచి ఎవరో ఒకరు కార్పొరేట్ స్కూల్ లేదా కాలేజీల్లో చదువుకుంటున్నవారే. స్థోమత ఉన్నా లేకున్నా.. వీరంతా లక్షలకు లక్షలు కట్టేవాళ్లే. జగన్ అధికారంలోకి వస్తే ఫీజుల విషయంలో వీరందరికీ ఊరట లభించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ జీవో ప్రకారమే ఫీజులు వసూలు చేయాలంటూ కార్పొరేట్ విద్యాసంస్థలకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు కోర్టు మెట్లెక్కబోతున్నారు. కోర్టు జోక్యం చేసుకుంటే కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాల గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టే. మంత్రి నారాయణ విద్యాసంస్థలకు ఇది చాలా పెద్దదెబ్బ.

మరింత సమాచారం తెలుసుకోండి: