ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కాలంగా ఊరిస్తున్న మంత్రి వర్గ విస్తరణను ఈ నెలాఖరులో చేపడతారని టాక్. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు రెడీ అయ్యేలా టేం  ని సెట్ చేస్తారని అంటున్నారు. నిజానికి చాలాకాలంగా విస్తరణ అన్న మాట వినిపిస్తున్నా ఎందుకో బాబు సరైన టైం కోసం వెయిట్  చేస్తున్నట్లుగా కనిపించారు. ఆ టైం ఇపుడు వచ్చేసిందని పార్టీ వర్గాలంటున్నాయి.


ముస్లిం నేతకు చాన్స్ :


నాలుగు నెలల క్రితం బాబు క్యాబినెట్ నుంచి రాజీనామాలు చేసి బయటకు వెళ్ళిన ఇద్దరు బీజేపీ మంత్రుల  ఖాళీలు అలాగే ఉన్నాయి. దాంతో పాటు మరో ఖాళీ ఉంది. సో టొటల్ గా  చూసుకుంటే ముగ్గురికి బెర్త్ ఉంది. కానీ బాబు మాత్రం అర్జెంట్ గా ముస్లిం కి మంత్రి పదవి కట్టబెట్టాలని ఆరాటపడుతున్నట్లు భోగట్టా. పోయిన ఎన్నికలలో ముస్లిం మైనారిటీలు వైసీపీ వైపు వెళ్ళారు. బీజేపీతో కటీఫ్ తరువాత బాబు చూపు మళ్ళీ వారిపైన పడింది. మంత్రి పదవి ఇవ్వడం ద్వారా వారిని చేరదీస్తే వచ్చే ఎన్నికలలో గంప గుత్తగా ఓట్లన్నీ తన ఖాతాలో పడిపోతాయని బాబు ఆలోచిస్తున్నారట. అందుకోసమె ఇపుడు ఈ విస్తరణ అంటున్నారు.


రేసులో నలుగురు :


ముస్లిం కి మంత్రి పదవి ఇస్తారని సమాచారంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, చాంద్ పాషాలతో పాటు, పార్టీకి విధేయుడిగా ఉన్న ఎమ్మెల్సీ షరీఫ్ ఉన్నారు. ఇంకోవైపు శాసన మండలి చైర్మన్ ఫరూఖ్ కూడా మంత్రి పదవి కోరుతున్నారని టాక్. పార్టీలోని సీనియర్లు కూడా ఆయన పేరే సజెస్ట్ చేస్తున్నారట. ఇక ఫిరాపింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ లో  ఆశ చావడం లేదు. ఏదో విధంగా మంత్రి అయిపోవాలని గట్టిగానే ట్రై చేసుకుంటున్నారు. మరో వైపు ఎమ్మెల్సీ షరీఫ్ తన విధెయతనే నమ్ముకున్నారు. చాంద్ పాషా లక్కును తొక్కాలని ఆశ పడుతున్నారు. చూడాలి మరి ఏం మ్యాజిక్ చేస్తారో బాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: