ఎన్నికలు వస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో మంత్రి అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిల వివాదం తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వీరిద్దరి కి సంబంధించిన గొడవ విషయంలో మూడుసార్లు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సమక్షాన పంచాయతీలు జరిగిన...

Image result for minister akhila priya

ఇద్దరు నేతల మధ్య సామరస్య వాతావరణం నెల కొనలేదు. దీంతో రెండు పార్టీ నాయకుల మధ్య వివాదంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఆళ్ల‌గ‌డ్డ‌లో త‌న హ‌వా చూపిస్తోంది.. ఇక ఏవీ కుమార్తె జ‌శ్వంత రెడ్డి కూడా తండ్రి వెంటే ఎక్కువ రాజ‌కీయంగా ఉంటున్నారు..త‌న తండ్రిని సెంట‌ర్ చేశార‌ని అఖిల‌మీద గ‌తంలో ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే..

Related image

ఇటు ఆళ్ల‌గ‌డ్డ‌లో వైసీపీ త‌ర‌పున గంగుల ఫ్యామిలీ పొలిటిక‌ల్ గా ముందుకు వెళుతుంటే, తెలుగుదేశంలో మాత్రం వీరు ఇద్ద‌రు ఎవ‌రికి వారు రాజ‌కీయం చేసుకుంటున్నారు. ఇది స్ధానిక టీడీపీ కేడ‌ర్ కు పెద్ద స‌మ‌స్య‌గా మారింది.. ఏవీకి తాజాగా ప‌ద‌వి వ‌చ్చానా మంత్రి అఖిల మాత్రం ఆయ‌న‌కు విషెస్ కూడా తెలియ‌చేయ‌లేదు. మొత్తానికి పొలిటిక‌ల్ గా వీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా డ్యామేజ్ మాత్రం టీడీపీకి ఇక్క‌డ ఎక్కువ‌గా ఉంటుంది అని అంటున్నారు...రాజకీయవిశ్లేషకులు.

Related image

అయితే ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇటువంటి గొడవల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చంద్రబాబుకు రాయలసీమ ప్రాంత టిడిపి నేతలు తెలియజేస్తున్నారు...ఈ గొడవకు ఎన్నికల ముందే సరైన పరిష్కారం చూపాలని బాబు గారిని కోరారట సీమ ప్రాంత నేతలు. మరి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: