విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ సీటు ఎపుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఉద్దండులంతా ఇక్కడ నుంచి పోటీ చేయడమే కాదు. రాజకీయంగానూ జనం నాడి చెప్పే సీటు ఇది. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి బావమరిది, సినీ నిర్మాత అల్లు అరవిందు పోటీ చేయడంతో  స్టేట్ లెవెల్ లో  ఈ సీటు మారు మోగింది. అలాగే 1989 ఎన్నికల్లో కేవలం 9 ఓట్లతో అప్పటి టీడీపీ క్యాండేట్ అప్పల నరసిమ్హం ను ఓడించి కాంగ్రెస్ నాయకుడు కొణతాల రామక్రిష్ణ గెలిచి గిన్నీస్ రికార్డ్ కి ఎక్కారు. అలాంటి సీటు పై ఇపుడు అధికార పార్టీలో పలువురి కన్ను పడింది.


ఆ ఇద్దరూ అక్కడ నుంచే :


విశాఖ జిల్లా రాజకీయాలను శాసిస్తున్న  అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు కూడా అనకాపల్లి నుంచి ఎంపీలుగా పనిచేసారు. గంటా రాజకీయ ప్రస్థానమే అక్కడ నుంచి మొదలైంది. ఇపుడు ఈ సీటు కోసం మంత్రి అయ్యన్న కుమారుడు విజయ పాత్రుడు  గట్టిగా ట్రై చేస్తున్నట్లు టాక్. తండ్రి వారసత్వంగా రాజకీయాలోకి వస్తున్న విజయ్ ఎట్టి పరిస్తితులలోనూ వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకోసం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు కూడా.


చినబాబు మద్దతు :


మంత్రి లోకేష్ తో విజయ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. లోకేష్ సైతం యువ నాయకులతో టీం ని రెడీ చెసిపెట్టుకుంటున్నారు. అలా లోకెష్ టీం లో ఉన్న విజయ్ తనకు టికెట్ ష్యూర్ అని ధీమాగా ఉన్నారు. ఎంపీగా చాన్స్ ఇస్తే గెలిచి చూపిస్తానని అంటున్నారు. విద్యాధికుడైన విజయ్ అయ్యన్న వారసత్వంగా నర్శీపట్నం లో బలం ఎటూ ఉంది, రూరల్ జిల్లాలలో టీడీపీ హవా ఉందని, దాంతో గెలుపు ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. అయ్యన్న సైతం కొడుకు అరంగేట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంటున్నారు. \


మరింత సమాచారం తెలుసుకోండి: