రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ పదవిని బీజేపీ గెలుచుకున్న సంగతీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ కు మరియు బీజేపీ కి తేడా కొన్ని ఓట్లు మాత్రమే. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ కు టీడీపీ సపోర్ట్ చేసింది. ఒక వేళ కాంగ్రెస్ నెగ్గి ఉండి ఉంటే టీడీపీ ఎలా డబ్బా కొట్టుకుని ఉండేదో వేరే చెప్పాల్సిన పని లేదు. మా  వల్లనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెగ్గాడని, తమే మోడీ అభ్యర్థిని ఓడించామని.. బీజేపీకి బుద్ధి చెప్పామని.. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేసుకొనే వారు .

Image result for tdp

చంద్రబాబు అయితే ప్రెస్ మీట్ పెట్టి చూశారా.. నా సత్తా అని చెప్పుకునే వారు. చినబాబు లోకేష్ సంగతి సరేసరి. చంద్రబాబుతో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థం చేసుకోవాలని మోడీకి ఒక హెచ్చరికనే పాస్ చేసేవాడు. ఎలాగోలా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచి ఉంటే.. అప్పుడు తెలుగుదేశం పార్టీని పట్టడం ఎవ్వరితరం అయ్యేదికాదు. కర్ణాటకలో భారతీయ జనతాపార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తేనే.. అక్కడ ఆ పార్టీని తామే ఓడించామని చెప్పుకు తిరుగుతున్నారు తెలుగుదేశం వాళ్లు. మరీ బరి తెగించేసిన పార్టీగా తయారైన తెలుగుదేశం ఇలా ఎక్కడేం జరిగినా అది తమ విజయమే అని చెప్పుకునే దశకు దిగజారిపోయింది.

Image result for rahul gandhi

ఇప్పడూ కాంగ్రెస్ ఓడి పోయేసరికి టీడీపీ కొత్త పల్లవి పాడుతుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణం రాహుల్ గాంధీ చేతగాని తనమేనట. ఇది తెలుగుదేశం అనుకూల మీడియా ఘోష. బాధ. ఆవేశం, ఆవేదన. తెలుగుదేశం నేతలు కూడా ఇదేమాటే చెబుతున్నారు. రాహుల్ గాంధీనే గనుక సరిగా వ్యవహరించి ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఫోన్లు చేసి ఉంటే.. బీజేపీ వ్యతిరేక పక్షాలను కలుపుకుపోయి ఉంటే.. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే వాడని.. తెలుగుదేశం వర్గాలు వాపోతూ ఉన్నాయి. ఇలా చేయలేదు కాబట్టి.. రాహుల్ గాంధీ చేతగాని వాడిగా, దద్ధమ్మగా కనిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: