వైసీపీ ఇపుడు యాంటీ బాబు టీం  కి షెల్టర్ గా మారుతోంది. ముఖ్యంగా  బాబంటే పడని నందమూరి ఫ్యామిలీకి కేరాఫ్ అడ్రెస్ అయిపోతోంది. నేచురల్ గా  జగన్  బాబుకు బద్ద శత్రువు, అదే కోవలో అన్న నందమూరి కుటుంబంలో పడని వారందరి చూపూ ఇటు వైపే ఉంది. చాన్నాళ్ళ ముందే ఎంటీయార్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి వైసీపీలో చేరిపోయారు. ఆమె పగ అంతా బాబుపైనే. ఎలాగైనా ఓడించాలన్న శపధం ఆమెది. ఇక అదే నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఆడపడుచు దగ్గుబాటి పురందేశ్వరి. ఆమెకు సైతం మరిది గారంటే మహా మంట. ఆయనతో పడకనే ఆమె మొదట కాంగ్రెస్ లో చేరారు. అక్కడ నుంచి బీజేపీలోకి వచ్చిన చిన్నమ్మ ఇపుడు వైసీపీలోకి రావాలంటుకుంటున్నారు.


అక్కడ సీటు కావాలట :


పురందేశ్వరికి మళ్ళీ ఎంపీగా పోటీ చేసి లోక్ సభకు వెళ్ళాలని కోరిక. ఇపుడున్న బీజేపీలో ఆమెకు సీటు ఖాయమైనా గెలుపు డౌట్. అందుకే సీటు ఇస్తే పార్టీ మారాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమె చూపు వైసీపీ పై పడిందని టాక్. జగన్ కనుక ఆహ్వానిస్తే విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీకు ఆమె రెడీగా ఉన్నారట. మరో వైపు వైసీపీకి కూడా సరైన క్యాండిడేట్ ఇక్కడ లేరంటున్నారు. . పైగా అన్న నందమూరి సొంత జిల్లాలో ఆయన కుమార్తె పోటీ చేస్తే అది తమకు ప్లస్ అవుతుందని కూడా వైసీపీ భావిస్తోంది అంటున్నారు. 


కొడుకు కూడానా :


మరో వైపు తన కుమారుడు దగ్గుబాటి హితైష్ ని కూడా పొలిటికల్ ఎంట్రీ ఇప్పించేందుకు చిన్నమ్మ ట్రై చేస్తోందని భోగట్టా. సొంత జిల్లా ప్రకాశం నుంచే హితైష్ బరిలో ఉంటాడని చెబుతున్నారు. తండ్రి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహించిన పరుచూరు నుంచి ఎమ్మెల్యేగా రంగంలోకి దించాలనుకుంటున్నారు.  మరి జగన్ ఈ రెండు ప్రతిపాదనలకూ ఒకే చెబుతారా అన్నది తేలాలి. అదే జరిగితే నందమూరి కుమార్తె, మనవడు కూడా వైసీపీ గూటికి చేరడం ష్యూర్ అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: