టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి దళితులు మీద దాడులు జరుగుతున్నాయి ఒక పక్క దళిత తేజం అంటూ టీడీపీ సభలు నిర్వహిస్తుంటే మరో పక్క వారి మీద దాడులు పెరిగి పోతున్నాయి. ఈ దాడులకు ఖచ్చితంగా టీడీపీ భాద్యత వహించాలి. ఇటీవల నెల్లూరుజిల్లా రాపూరులో పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు సైతం ఈ ఘటనపై వివరాలు సేకరించిన నేపథ్యంలో, ఆ పాపం చంద్రబాబు సర్కారు మెడకు చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Image result for chandra babu

దళితులపై దాడి చేయడమే కాకుండా, వారినే బాధ్యులుగా చేస్తూ ఏకంగా 50 మందిపై స్థానిక పోలీసులు కేసులు పెట్టడంతో రాపూరు దళితవాడ పూర్తిగా ఖాళీ అయిపోయింది. 100 కుటుంబాల్లో పట్టుమని పదిమంది కూడా అక్కడ నివసించని పరిస్థితి. దళితులకు అండగా ఉండాల్సిన కలెక్టర్, ఎస్పీ కూడా వారిపై కేసులు పెట్టడాన్ని సమర్థించారని, వారికి భరోసా కల్పించలేకపోయారని ఎస్సీ కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Image result for chandra babu

ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకి సిఫార్సు చేశారు. ఇప్పటికే పలుజిల్లాల్లో దళితులంతా ఈ ఘటనపై నిరసన తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించడానికి కూడా వారు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని బలహీన పరచడానికి సిద్ధమైన కేంద్రం, విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గడం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ హయాంలో వారిపై దాడులు పెరిగిపోవడంతో.. ఆ వర్గానికి చెందినవారంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: