వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు చాలా కొత్త ముఖాలు తెర ముందుకు వస్తున్నాయి. అలాగే రాజకీయ పార్టీల అధినేతల బంధువర్గమూ సై అంటోంది. ఏపీలో ఈసారి ముక్కోణపు పోటీ జరగనుంది. కొత్తగా వచ్చిన జనసేన పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు అనేకమంది రెడీ అంటున్నారు. ఇంటెరెస్టింగ్ మాటర్ ఏంటంటే ఈసారి పోటీలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు కూడా ఉంటారట.


అక్కడ నుంచి :


జనసేనానికి కాపు కాస్తాయని అంతా భావిస్తున్న గోదావరి జిల్లాల నుంచే మెగా బ్రదర్ పోటీ ఉంటుందట. ఇందుకోసం ఆయన ఓ సేఫ్ సీటుని కూడా రెడీ చేసి పెట్టుకున్నారట. తమ్ముడు ఓకే  అంటే దూకేస్తానని అంటున్నాడు. . తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి మెగా బ్రదర్ నాగ్రేంద్ర బాబు పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇక్కడ సొంత సామాజిక వర్గం విశేషంగా ఉండడంతో పాటు, పవన్ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంట.


ఆ చేరికతో జోష్ :



కాకినాడపై స్పెషల్ గా ద్రుష్టి పెట్టిన పవన్ అక్కడ చేరికలను బాగా ప్రోత్సహిస్తున్నాడట. ఈ మధ్యనే వైసీపీ నుంచి మాజీ మంత్రి, ఆయన కుటుంబం జనసేనలో చేరిపోయింది. మాజీ మంత్రి ముత్తా గోపాలక్రిష్ణ చేరడంతో కాకినాడలో పార్టీకి కొత్త బలం వచ్చిందని పవన్ భావిస్తున్నట్లు టాక్. మరింతమందిని తిప్పుకోవడం ద్వారా ఇక్కడ నుంచి అన్న గారిని ఎలాగైనా గెలిపించుకోవాలని పవన్ తాపత్రయపడుతున్నారట. మరి ఓ వైపు బలమైన టీడీపీ, వైసీపీ రంగంలో ఉన్నాయి. రెండింటినీ తట్టుకుని నాగబాబు గెలుపు సాధ్యమేనా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: