తెలంగాణాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి  ఈ రోజు చేసిన  టూర్ అక్కడ పొలిటికల్ హీట్ ని పెంచేసింది. ఇప్పటికే ముదస్తు ఎన్నికల సన్నాహాలలో ఉన్న కేసీయార్ ని టార్గెట్ గా చేసుకుని రాహుల్ పదునైన బాణాలనే వేశారు. మోడీ, కేసీయార్ లను కలిపి పంచ్ లు పేల్చారు. తెలంగాణా కు కేసీయార్  చేసిందేమిటంటూ నడిబొడ్డుపై నిలదీయడం ద్వారా ఆయనను డైరెక్ట్ ఫైట్ లోకి లాగారు. మీకు మేమే జవాబు సుమా అన్న మెసేజ్ నీ పంపారు.


మీరే బాగుపడ్డారు :



తెలంగాణా రావడం వల్ల బాగుపడింది ఒక్క కేసీయార్ ఫ్యామిలీ మాత్రమేనని రాహుల్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బడుగుల, బలహీనుల కోసం తెలంగాణా కాదని, కేవలం టీయారెస్ అధినాయకుడి కే ఫలాలు దక్కాయని రాహుల్ అన్నారు. సంపన్నమైన తెలంగాణాను అప్పుల కుప్పను చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు ఏం చేశారని మోడీ సర్కార్ కి మద్దతు గా నిలుస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీలు ఒక్కటైనా మోడీ నెరవేర్చారా అంటూ సూటిగా ప్రశ్నించారు.


మోడీ అంటే అంతే :


నరేంద్రమోడీ మాటల గారడితో దేశ ప్రజలను వంచించారని రాహుల్ అన్నారు. అబద్దాలు చెప్పడమే తప్ప ఆచరణలో ఒక్క హామీ తీర్చలేదన్నారు. పెద్దలకు అండగా ఉంటూ పేదల జేబులు కొట్టే పాలసీలే మోడీ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు దేశ ఆర్ధిక వ్యవస్థను తల్లకిందులు చేశాయని రాహుల్ అన్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అన్నారు, ఏమైది ఆ హామీ అంటూ నిలదీశారు.

కాంగ్రెస్ లో జోష్ :


మొత్తానికి రాహుల్ టూర్ తో తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో జోష్ ని నింపగలిగారు. అదే టైం లో ఎదురులేదనుకున్న కేసీయార్ సర్కార్ కి మేమున్నామంటూ బలమైన సవాల్ విసిరారు. దలితులు, మైనారిటీలు, బడుగుల పక్షాన మాట్లాడడం  ద్వారా ఆయా వర్గాలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించారు. తొందరలోనే తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయని ఊహాగానాలు చెలరేగుతున్న టైంలో రాహుల్ టూర్ హస్తం పార్టీకి కొండంత భరోసా ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: