వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ముగించుకొని విశాఖ జిల్లాలో అడుగు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్టణానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ కి అద్భుతమైన స్వాగతం పలికారు. గత జిల్లాలో మాదిరిగానే విశాఖ జిల్లాలో కూడా ప్రజలు జగన్ కి బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను అలాగే తమ ఇబ్బందులను జగన్ కి చెప్పుకుంటున్నారు విశాఖ వాసులు.

Image may contain: 8 people, people smiling, people standing and outdoor

ఈ ఖమ్మంలో జగన్ వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక రోజులు పాదయాత్ర చేసిన జగన్ ఆ జిల్లా వీడుతున్న సమయంలో ప్రజలనుద్దేశించి జగన్ అన్న మాటలు తూర్పుగోదావరి జిల్లా వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో వీడుతూ జగన్ మాట్లాడుతూ...న‌న్ను ఆదరించి, ఆశీర్వదించిన గోదావరి జిల్లాల ప్రజలకు రుణపడి ఉంటాను.

Image may contain: 11 people, people smiling, crowd, tree and outdoor

2 నెల‌ల‌పాటు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌యాణం.. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ వారి జీవ‌న‌శైలి తెలుసుకోవ‌డం .. వారి అనిర్వ‌చ‌నీయ‌మైన ప్రేమాభిమానాల‌ను పొంద‌డం.. జీవితంలో ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని మ‌ధుర‌మైన అనుభూతి అంటూ పేర్కొన్నారు. మరిముఖ్యంగా మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.

Image may contain: one or more people, people standing, crowd and outdoor

అంతేకాకుండా రానున్నవి మంచి రోజులను అందరి జీవితాలు మారుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు జగన్. ఈ క్రమంలో జగన్ తూర్పుగోదావరి జిల్లా వీడుతున్న సమయంలో ఆ జిల్లాకు చెందిన ప్రజలు కొంతమంది భావోద్వేగానికి గురయ్యారు. వచ్చేఎన్నికలలో జగన్ని కచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: