ఈ ఏడాదితో ముఖ్యమంత్రి గా చంద్రబాబు మరో మారు జాతీయ జెండా ఎగరవేశారు.  ఉత్తరాంధ్రలో చివరన ఉన్న శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ రోజు  జరిగిన ఓ కార్యక్రమంలో బాబు జెండా వందనం చేశారు. సీఎంగా ఆయనకు ఇది అయిదవసారి. వచ్చే ఏడాది ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో వారికే ఆ చాన్స్, . అంటే ఈ టెర్మ్ లో  బాబుకు ఇదే చివరిసారిగా చెప్పుకోవాలి.


ఈ చివరన ఈయన :


అదే ఉత్తరాంధ్రాలో ఈ చివరన అంటే విశాఖ జిల్లాలో నర్శీపట్నం అసెంబ్లీ ఎర్రవరం గ్రామంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ మాతను స్మరించుకున్నారు. ఇది నిజంగా ఓ అరుదైన సన్నివేశం. ఏపీలో ఇద్దరు ప్రముఖులు సీఎం, ప్రతిపక్ష నాయకుడు ఉత్తరాంధ్రాలోనే ఉండడం, జెండా వందనం చేయడం విశేష పరిణామం గానే చెప్పుకోవాలి. 


బాబుదే ప్లాన్ :


నిజానికి ఆగస్ట్ నెలలో జగన్ పాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశిస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఆయన షెడ్యూల్ అలా ముందే ఖరార్ అయిపోయింది. మరి ప్రభుత్వం విషయంలోనే ప్లాన్ ఇలా మారింది. ప్రతీ ఏటా ఒక్కో జిల్లాలో జెండా వందనం చేస్తున్న బాబు ఈసారి ఏరి కోరి మరీ ఉత్తరాంధ్రాను ఎంచుకున్నారు. దీని వెనక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయన్నది సుస్పష్టం. ఉత్తరాంధ్ర ఎక్కడ చేజారుతుందోనని కడు జాగ్రత్తగా బాబు అధికారిక కార్యక్రమం ఇలా ప్లాన్ చేశారనుకోవాలి. 


గంభీరంగా బాబు :


శ్రీకాకుళంలో ఆగస్ట్ పదిహేను వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు గంభీరంగా కనిపించారు. గౌరవ వందనం స్వీకరిస్తున్నపుడు కానీ, సాంస్క్రుతిక  కార్యక్రమాల  టైంలో కానీ బాబు లో ఎక్కడా నవ్వు కనిపించలేదు. పైగా ఏదో టెన్షన్లో ఉన్నట్లుగా ఆయన కనిపించారు. సీఎం గా ఈ టెర్మ్ లో ఇదే లాస్ట్ చాన్స్ అన్న వూహ బాబు మదిలో  ఉందో ఏమో తెలియదు కానీ ఆయన మాత్రం  ముభావంగానే ఆద్యంతం  అగుపించారు.


ఇక్కడ జోష్ :


ఇక అదే టైంలో విశాఖ జిల్లాలో విడిది చేసిన జగన్ ఎర్రవరంలో జెండా ఆవిష్కరణలో పాలుపంచుకున్నపుడు మాచి జోష్ తో కనిపించారు. పార్టీ నాయకులు సైతం ఉత్సాహంగా ఈ వేడుకలలకు హాజరయ్యారు. జగన్ లో ధీమా చూసిన నాయకులు, జనాలు ఆయనలో ఏదో కొత్త కళ కనిపిస్తోందని అంటున్నారు. మరి చూడాలి ఈసారి ఉత్తరాంధ్రలో చెరో వైపు వేరు వేరు పొజిషన్లలో బాబు, జగన్ జెండాలు ఎగరేస్తూ కనిపించారు. వచ్చే ఏడాది ఏం జరుగుతుందో, ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: