అటల్ బిహారీ వాజపేయి ఈ పేరు చెబితే చాలు భారత దేశం గర్విస్తుంది. ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు ఒక మనసున్న నేతగా.. రాజకీయాల్లో కొత్త ఒరవడులను ప్రవేశ పెట్టిన నేతగా . అధికారంలో కొనసాగడానికి అవసరమైతే పది మందినో, పాతిక మందినో కొనేయడం నేటి రాజకీయం. ఒక్క ఓటుతో పదవి పోతుందని తెలిసీ, ఆ ఒక్క ఓటు కోసం ప్రయత్నించకపోవడం వాజ్‌పేయి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం.

Image result for atal bihari vajpayee

పాకిస్తాన్‌తో కార్గిల్‌ యుద్ధం చేసినా.. పాకిస్తాన్‌కి బస్సులో వెళ్ళినా.. అది వాజ్‌పేయి ఘనతే. స్నేహ హస్తం చూపించడమే కాదు, ఆ స్నేహాన్ని అలుసుగా తీసుకుంటే.. బుద్ధి చెప్పగల నేర్పరితనం తనకు సొంతమని వాజ్‌పేయి నిరూపించారు.  ఆయన మాట ఎంత తియ్యగా వుంటుందంటే.. ప్రతిపక్షంలో వున్నోళ్ళు కూడా ఆ మాటలకి ఫిదా అయిపోతారు మరి.! మామూలుగా, అధికార పక్షంలో వున్నోళ్ళని విపక్షంలో వున్నోళ్ళు ప్రశంసించరుగాక ప్రశంసించరు.

Image result for atal bihari vajpayee

కానీ, వాజ్‌పేయి అలా కాదు.. ఇందిరాగాంధీని 'దుర్గ'గా అభివర్ణించిన గొప్ప మనసున్న మారాజు. వాజ్‌పేయి గురించి చెప్పాలంటే, అది చాలా పెద్ద కథ. ఇది కథ కాదు, నిజం. భవిష్యత్‌ తరాలు తెలుసుకోవాల్సిన వాస్తవం. భారత అణుశక్తిని ప్రపంచానికి చాటే క్రమంలో ఎదురయ్యే సవాళ్ళను ముందుగానే ఊహించి, ఏది ఏమైనా దేశం మీసం మెలెయ్యాల్సిందేనని భావించిన వాజ్‌పేయిని భారతదేశం మర్చిపోగలదా.? ఛాన్సే లేదు. జన్‌ సంఘ్‌ నుంచి.. భారతీయ జనతా పార్టీ దాకా.. ఆయన ప్రయాణం ఓ అద్భుతం. ప్రధాన మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: