అందరిలాగానే యుక్త వయసులో వాజ్ పేయ్ లోనూ ప్రేమ ఉదయించింది. ఆయన ప్రేమను అలా పొందిన ఆమె పేరు రాజ కుమారి. వాజ్ పేయి సన్నిహితులకు మాత్రమే తెలిసిన ఈ కధను 1942 లవ్ స్టోరీగా చెప్పుకుంటారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ విక్టోరియా కళాశాలలో వాజ్ పేయి అపుడు చదివేవారు. ఆయన పద్దెనిమి ఏళ్ళ నూనూగు మీసాల నూత్న యవ్వనుడు. ఆయన మనసు దోచిన రాజకుమారి కూడా అక్కడే చదివేవారు. అలా మొగ్గ తొడిగిన ప్రేమ సుఖాంతం కాలేదు.


పెద్దలు బ్రేక్ :


రాజకుమారి కుటుంబం వాజ్ పేయ్ ని పెళ్ళి చేసుకోవడానికి అభ్యంతరం పెట్టడంతో ఆ ప్రేమ అలా విఫలమైంది. తరువాత     బ్రజ్ నారాయణ్ కౌల్ అనే ఓ లెక్చరర్ కు  రాజకుమారిని ఇచ్చి పెద్దలు పెళ్ళి చేశారు. అలా తొలి ప్రేమ విఫలం కావడంతో వాజ్ పేయ్ మళ్ళీ ప్రేమ, పెళ్ళి ఊసే ఎత్తకుండా దేశం కోసం పూర్తి జీవితాని అంకితం  చేసేశారు. 


నిష్కల్మషమైన ప్రేమ :


ఆ తరువాత తాను ప్రేమించిన రాజకుమారి కుమార్తె నమితను ఆయన దత్తతకు తీసుకుని అల్లారు  ముద్దుగా పెంచుకున్నారు. చివరి శ్వాస వరకూ ఆమె వద్దనే గడిపిన వాజ్ పేయ్ కి పెంపుడు కూతురన్నా, ఆమెకు పుట్టిన మనవరాలు నీహారిక అన్నా ప్రాణం. నిజంగా వాజ్ పేయ్ ప్రేమలోనూ కొత్త కోణం చూపారనిపిస్తుంది. ప్రేమ అంటే చంపడం, చావడం కాదు, ఒకరికి మనసు ఇస్తే జీవితాంతం ఆ ప్రేమను అలా గుండెల్లో పొదువు కోవడమే అసలైన ప్రేమ అంటే అని ఆచరణాత్మకంగా రుజువు చేశారు. ఓ విధంగా వాజ్ పేయ్ ప్రేమకే గురువు అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: