టీడీపీ పార్టీ లో చంద్ర బాబు తరువాత సీఎం అయ్యేది లోకేష్ అని అందరూ అనుకుంటున్నారు. అయితే  చంద్ర బాబు తరువాత టీడీపీ అధికారం లో కి వస్తే లోకేష్ సీఎం అవుతాడులే అయితే ఇప్పుడు లోకేష్ యవ్వారం చూస్తుంటే తనే టీడీపీ ని నేలమట్టం చేసే విధంగా కనిపిస్తున్నాడు.  పాపం.. చంద్రబాబు ఎన్ని కష్టాలు పడ్డా, నారా లోకేష్‌లో మార్పు రావడంలేదు. ఆయన వల్ల తెలుగుదేశం పార్టీకి అదనంగా ఒరిగిందేమీ లేదు ... నష్టం తప్ప. చాలా వేదికలపై నారా లోకేష్‌ మాట్లాడిన మాటలు వివాదాస్పదమవడం చూశాం.

Image result for lokesh nara

'తత్తరబాటు'కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నారా లోకేష్‌ని చెప్పొచ్చు. జయంతిని వర్ధంతిగా అభివర్ణించడమే కాదు, తెలుగుదేశం పార్టీని అవినీతి పార్టీగా ప్రచారం చేసిన ఘనుడీ చినబాబు. అలా తెలుగుదేశం పార్టీకి ఎప్పటికప్పుడు సరికొత్త కష్టాలు తెచ్చిపెట్టడం లోకేష్‌కి అలవాటుగా మారిపోయింది.  సోషల్‌ మీడియాలో ఏదన్నా ముఖ్యమైన విషయానికి సంబంధించి లోకేష్‌ ట్వీటేశాడంటే అంతే సంగతి.. నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటారు.

Image result for lokesh nara

మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణం నేపథ్యంలో, ఆయనకు సోషల్‌ మీడియా ద్వారా నివాళి అర్పిద్దామనుకున్న లోకేష్‌, "నాన్నారు చంద్రబాబు" పేరు తగిలిస్తే బావుంటుందనుకున్నారో ఏమో.. కాస్తంత 'అతి' చేశారు. అదిప్పుడు వైరల్‌ అయ్యింది. వాజ్‌పేయి గొప్పతనం కీర్తించేసి 'రెస్ట్‌ ఇన్‌ పీస్‌' అనేస్తే పోయేది. కానీ, తన తండ్రి నారా చంద్రబాబునాయుడ్ని సీన్‌లోకి లాగేసి పెద్ద తప్పే చేశారు లోకేష్‌. ఇంత పబ్లిసిటీ పిచ్చి అవసరమా.? అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇదొక్కటే కాదు, ఆగస్ట్‌ 15న తన ఇంట్లో.. అదీ డాబా మీద జెండా ఎగరేసి, ఆ సమయంలో గౌరవ వందనాన్ని తన భార్యతో కలిసి స్వీకరించి లోకేష్‌ 'విమర్శకులకు' టార్గెట్‌ అయిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: