విశాఖ జిల్లాలో జగన్ పాదయాత్ర పెద్ద ఎత్తున సాగుతోంది. జనం కూడా తండోపతండాలుగా హాజరవుతున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇక జగన్ పాదయాత్రలో భాగంగా మొదటి మీటింగ్ ను మంత్రి అయ్యన్నపాత్రుడు ఇలాకా నర్శీపట్నంలోనే పెట్టారు. సీఎం బాబు, మంత్రి ఇద్దరినీ ఓ రేంజిలో దుమ్ము దులిపేశారు. దీంతో జిల్లా పాలిట్రిక్స్  హీటెక్కాయి. దాంతో కౌంటర్ అటాక్ స్టార్ట్ అయింది.


దమ్ముంటే రుజువు చేయ్ :


జగన్ తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని మంత్రి అయ్యన్నపాత్రుడు సవాల్ చేశారు. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన గాలి కబుర్లు చెబితే కుదరదని అన్నారు. తాను అవినీతి చేసినట్లు ఆధరాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక వేళ తాను అవినీతిపరున్ని అయితే రాజకీయలు వదిలేసి ఇంటికి పోతానంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు.


భ్రష్టు పట్టింది నిజమేనట:


రాజకీయాలు భ్రష్టు పట్టింది నిజమేనని మంత్రి అయ్యన్న అంగీకరిస్తున్నారు. అయితే అది తెలుగుదేశం వల్ల కాదని, జగన్ వల్లనేనని మాటలతో అటాక్ చేశారు. జగన్ రాజకీయాల్లోకి  రావడంతోనే ఇలా పరిస్థితి తయారైందని మండిపడ్డారు. ఎంతసేపు ఆరోపణలు చేయడం, నిందలు వేయడమే జగన్ పని అంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాలలో విలువలు గురించి జగన్ మాట్లాడం విడ్డూరమని అన్నారు.


అందుకేనా పాదయాత్ర:


ఎంతసేపూ  చంద్రబాబుని విమర్శించడమే జగన్ పని అంటూ మంత్రి విరుచుకుపడ్డారు. పాదయాత్ర చేసేది అందుకోసమేనా అని నిలదీశారు. అవినీతి బురదలో జగన్ నిండా కూరుకుపోయారని, అటువంటి  పెద్ద మనిషి బాబుపైన, తనపైన బురద జల్లాలనుకోవడమెంటని అయ్యన్న గుస్సా అయ్యారు. అభివ్రుధ్ధికే టీడీపీ కట్టుబడి వుందని, ప్రజల కోసమే తాము ఉన్నామని  మంత్రి చెప్పుకున్నారు. 


మొత్తానికి అయ్యన్నను ఎక్కడ టచ్  చేయలో అక్కడే జగన్ టచ్  చేశారనిపిస్తోంది. ఆయన ఇలాకాలో జగన్ పాదయాత్రకు జనం పోటెత్తుతూండడం టీడీపీని బాగానే కలవరపెడుతోంది. ముందు ముందు ఏం జరుగుతుందో, జిల్లా రాజకీయాలు ఎలా మలుపు తీసుకుంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: