వైసీపీ అధినేత జగన్ తూర్పుగోదావరి జిల్లాలో తన పాదయాత్రను దయచూపండి విశాఖ జిల్లాలో అడుగు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు జగన్కు భారీగా స్వాగతం పలికారు. పాదయాత్రలో భాగంగా జగన్ విశాఖ జిల్లాల్లో మొదటిసారి నర్సీపట్నంలో జరిగిన మహాసభలో ప్రభుత్వంపై చంద్రబాబు పై అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు టిడిపి మంత్రి అయినా అయ్యన్నపాత్రుడు పై సంచలన కామెంట్ చేశారు.

Image result for ayyanna patrudu

ముఖ్యంగా మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అవినీతిని లెక్కలతో సహా ప్రజల ముందు పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు బాగోతాన్ని బట్టబయలు చేశారు. దీంతో జగన్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు మంత్రి అయ్యన్న. జగన్ తనపై చేసిన అవినీతి ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెప్తానని జగన్ కి చాలెంజ్ విసిరారు. లక్ష కోట్ల అవినీతి కేసులో ముద్దాయి జగన్ తనపై దుష్ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు.

Related image

జగన్ లాంటి నేతల వల్ల రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని, చంద్రబాబుపై దుష్ప్రచారం చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు. అయితే తన అవినీతిని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి చెప్పడంతో విశాఖవాసులు షాకయ్యారు. జగన్ అయ్యన్నపాత్రుడి అవినీతిని లెక్కలు, ఆధారాలతో సహా చెప్తుంటే మళ్లీ లెక్కలు అడుగుతున్నాడేంటని, అయ్యన్న గాలిమాటలు మాట్లాడుతున్నారని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు.

Related image

అసలు విలువలు విశ్వసనీయత చంద్రబాబుకి గాని టిడిపి ప్రజాప్రతినిధులకు గాని ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు అధికార పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన దగాకోరు ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించారు వైసిపి నాయకులు. నాయకుడు తగ్గ మంత్రులు కాబట్టే మంత్రి అయ్యన్న నియోజకవర్గంలో ప్రతి పనికి రేటు కట్టి మరి విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారని సంచాలన కామెంట్లు చేశారు వైసీపీ నేతలు.




మరింత సమాచారం తెలుసుకోండి: