తెలుగుదేశం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆ మంత్రి గారు వాపోతున్నారు. ప్రజలు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని మధన పడుతున్నారు. ఎంత వీలైతె అంత వేగంగా ఆ విషయం బయట పెట్టాల్సిందేనని డిమాండ్  చేస్తున్నారు. ఇంతకీ ఏటా విషయం, ఏమా కధ...


 సిట్ నివేదిక వెలుగు చూడాల్సిందే:


రెండేళ్ళ క్రితం విశాఖలో వెలుగు చూసిన అతి పెద్ద భూ కుంభకోణం ఎన్నికల వేళ టీడీపీ గుండెళ్ళో రైళ్ళు పరిగెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ విశాఖ జిల్లాలో పాదయాత్ర చేయడమూ కలవరపరుస్తోంది. జగన్ విశాఖ సిటీలో అడుగుపెట్టేలోగానే ఆ సిట్ నివేదిక బయటపెట్టేసి తమ తప్పులేదని చెప్పాలని టీడీపీలో ఓ వర్గం ఆరాటపడుతోంది. కానీ అది జరిగే పని కాదన్నది ఆ పార్టీ పెద్దలకూ తెలుసు.


బాబునే అడగండి :


ఇదే విషయమై విశాఖ జిల్లా సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రున్ని విలేకరులు అడిగినపుడు ఆయన బాబు వైపే వెలెత్తి చూపడం విశేషం. నేను కూడా మీలాగనే ఎప్పటి నుంచో ఆ నివేదిక బయటపెట్టాలని కోరుతున్నానని అయ్యన్న అన్నారు. మరి ఎందుకు ప్రభుత్వం బయటపెట్టడం లేదో అయ్యన్నకైనా తెలుసో లేదో. విశాఖ భూ కుంభకోణం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిందని అయ్యన్న ఒప్పుకున్నారు కూడా. దానిపై తాము నిజాయతీగా ప్రత్యేక దర్యాప్త్ కమిటీ (సిట్) ని నియమించామని గొప్పలు చెప్పుకున్నారు.



 మరి సిట్ నివేదిక ఇచ్చేసి ఏడాది కావస్తోంది. దాని సంగేంటని మీడియా అడిగితే మాత్రం మంత్రి గారు నీళ్ళు నములుతున్నారు. పైగా విశాఖ వచ్చినపుడు  ముఖ్యమంత్రినే ఆ విషయం అడగండని మీడియానే ఎగదోస్తున్నారు. మరి ఇక్కడ అయ్యన్న రాజకీయ లెక్కలేంటో తెలియదు కానీ సిట్ నివేదికలో విశాఖ‌కు చెందిన బడా మనుషులు ఉన్నారని టాక్ నడుస్తోంది. అయ్యన్న గురి చూసి విసిరిన ఈ బాణం ఎవరికి తగలాలను అనుకుంటున్నారో తెలియదు కానీ బాబుని  మాత్రం మధ్యలో  ఇరకాటంలో పెట్టేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: