తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఒక్క సారే కదా పెళ్ళి అయింది. అది కూదా నందమూరి తారక రామారావు కూతురు భువనేశ్వరితోనే కదా అయింది. తెలుగు వారందరికీ ఈ సంగతి తెలిసిందే కదా. మరి బాబు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నారంటోంది విపక్షం. ఒకటి కాదు రెండు కాదు, చాలా పెళ్ళిళ్ళు బాబు చేసుకున్నడని ఆరోపిస్తోంది.  నిజమేనా ..


అలా అన్నమాట :


చంద్రబాబు నిజ జీవితంలో అసలు పెళ్ళి ఒకటే  కానీ రాజకీయాలలో మాత్రం ఆయన చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నరట. విశాఖ జిల్లా పాదయాత్రలో భాగంగా కోటఉరట్లలో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇలా ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి  వచ్చిన బాబు మామను దించేశాక పార్టీ అధ్యక్షుని   హోదాలో ఎన్నో రాజకీయ‌ పెళ్ళిళ్ళు చేసుకున్నారని జగన్ సెటైర్లు వేశారు.


ఎన్నికకో పెళ్ళి :


ప్రతి ఎన్నికకూ  పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, అవసరం తీరాక రాజకీయ విడాకులు ఇవ్వడం బాబుకు అలవాటు అయిందని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ, జనసేన, టీయారెస్, వామ పక్షాలు ఇలా అన్ని పార్టీలతో పెళ్ళిళ్ళు చేసుకుని విడాకులు ఇచ్చేసిన బాబు ఇపుడు కాంగ్రెస్ తో పెళ్ళికి రెడీ అయిపోయారని సెటైర్లు వేశారు. ఇందుకోసం తన కుటుంబ సభ్యులను రాహుల్ వద్దకు రాయబారానికి పంపారని ఆరోపించారు.


మరో వైపు బయటకు విడాకులు ఇచ్చినట్లు కనిపిస్తున్నా బీజేపీతో బాబు రాత్రి, కాంగ్రెస్ తో పగలు కాపురానికి సిధ్ధపడుతున్నారంటూ  అటాక్ చేశారు. ఇలా రాజకీయ పెళ్ళిళ్ళు చేసుకుంటూ తన పబ్బం గడుపుకుంటున్న బాబుకు ప్రజలే బుధ్ధి చెబుతారని జగన్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: