ఆమె కర్నూల్ జిల్లా డైన‌మిక్ పొలిటీషియన్ భూమా నాగిరెడ్డి దంపతుల గారాల పట్టి. తల్లి శోభా నాగిరెడ్డి మహిళా  నాయకురాలిగా ఏపీలో ఓ రోల్ మోడెల్ గా నిలిచారు. ఇక భూమా నాగిరెడ్డి కర్నూల్ జిల్లా పాలిటిక్స్ ని శాసించారు. ఈ ఇద్దరు దురద్రుష్టవశాత్తు కన్ను మూశారు. వారి వారసురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అఖిల ప్రియ చిన్న వయసులోనే మంత్రిణి అయిపోయింది. తల్లిదండ్రులకు దక్కని మినిస్టర్ పోస్ట్ చేపట్టి వారి కలలను అలా నిజం చేసింది.


పీటలెక్కుతున్న అఖిల :


మంత్రిగా ఏడాదిన్నరగా బాబు క్యాబినెట్లో పనిచేస్తున్న అఖిల ప్రియ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతోంది. ఈ నెల వివాహానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త మాధుర్ భార్గవ రామ్ నాయుడితో ఈ నెల 29న ఉదయం 10.57గంటలకు వివాహం జరగనుంది. ఈ మేరకు శుభలేఖల పంపిణీ ప్రారంభించింది భూమా కుటుంబం. వివాహ ఆహ్వానపత్రిక ఆకర్షణీయంగా ఉంది. తమ తల్లిదండ్రులు శోభ, నాగిరెడ్డిల ఫొటోలతో ఆహ్వాన పత్రికను ముద్రించారు.


 కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభా నాగిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు. రిసెప్షన్ సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది.  మొత్తానికి అఖిల ప్రియ మంత్రిణిగా పెళ్ళి చేసుకోవడం ఓ విశేషమైతే ఎన్నికల వేడి ఓ వైపు రాజుకుంటున్న ఈ సీజన్లో ఈ పెళ్ళి కొంత కూల్ వాతావరణాన్ని తెస్తోంది. అందరు పొలిటీషియన్లు ఒకే చోట చేరడం ఓ విశేషమే మరి


మరింత సమాచారం తెలుసుకోండి: